Begin typing your search above and press return to search.

కమ‌ల్ క్లాసిక్ ట్యూన్ కి శ్రుతి మెస్మ‌రైజింగ్ స్టెప్పులు

By:  Tupaki Desk   |   3 Sep 2022 2:03 PM GMT
కమ‌ల్ క్లాసిక్ ట్యూన్ కి శ్రుతి మెస్మ‌రైజింగ్ స్టెప్పులు
X
శృతి హాసన్ రేర్ స్టైల్ ఐకాన్. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నంతో ఆక‌ట్టుకోవ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. ఈ హాట్ బ్యూటీ ప్రత్యేకమైన బోల్డ్ మేక‌ప్ లుక్ తో యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా శ్రుతి డ్రెస్సింగ్ సెన్స్ మేక‌ప్ ప‌రంగా ప్ర‌యోగాల‌ను విడిచిపెట్ట‌దు.

ఇక ఈ బ్యూటీ ఎల్ల‌పుడూ నలుపు రంగును ప్రేమిస్తుంది. ఆ ముదురు రంగుతో యూనిక్ నెస్ ని ఆవిష్క‌రిస్తుంది. తాజాగా శ్రుతి లేటెక్స్ జంప్ సూట్ లో బ్లాక్ లుక్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. యాక్టివ్ సోషల్ మీడియా యూజర్ అయిన శ్రుతి హాసన్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక వీడియోను షేర్ చేసింది. స్మోకింగ్ హాట్ లుక్ లో తనవైన‌ డ్యాన్స్ మూవ్స్ ని ప్రదర్శించింది.

పిగ్గీ టేల్స్ బోల్డ్ మేకప్ తో బ్లాక్ లేటెక్స్ జంప్ సూట్ లో శ్రుతి టూ హాట్ గా క‌నిపించింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ కి త‌గ్గ‌ట్టే నల్ల బూట్లతో శ్రుతి డ్యాన్స్ మూవ్స్ జంప్ లు ఆక‌ట్టుకున్నాయి. రాజా క‌య వ‌చ్చే.. అంటూ సాగే కమ‌ల్ హాస‌న్ క్లాసిక్ ట్యూన్ కి శ్రుతి మెస్మ‌రైజింగ్ స్టెప్పులు ఎంతో యాప్ట్ గా ఆకట్టుకున్నాయి.

శృతి హాసన్ ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 కోసం బాలకృష్ణతో కలిసి టర్కీలో ఒక షెడ్యూల్ లో పాల్గొంది. సెట్స్ నుంచి బాలకృష్ణతో శృతి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో దునియా విజయ్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నాడు. అత‌డు ఈ చిత్రంలో విలన్ గా న‌టిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఏస్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ థమన్ ఎన్ బికె 107 పాటలు స‌హా నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పుడు శ్రుతి హాసన్ చిరంజీవి మాస్ ఎంటర్ టైనర్ చిరు 154 సెట్స్ లో చేరారు. మేకర్స్ హైదరాబాద్ లో సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన సుదీర్ఘమైన షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ .. వెన్నెల కిషోర్ కూడా ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. చిరు 154 కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.