Begin typing your search above and press return to search.
నటించడానికి సిద్ధమా లేక శుభవార్త?
By: Tupaki Desk | 11 April 2018 11:20 AM GMTశృతి హాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమయినప్పటికీ తనకంటూ బాగానే పేరు తెచ్చుకుంది. కానీ సడన్ గా ఏమైందోకాని సినిమలవైపే చూడట్లేదు. ఎంతసేపు బాయ్ ఫ్రెండ్ తో అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అని వార్తలు వస్తున్నాయి తప్ప ఆ సినిమా ఒప్పుకుంది ఈ సినిమా చేస్తుంది అని మాత్రం వార్తల్లోకి ఎక్కట్లేదు ఈ భామ. కానీ ఇప్పుడు ఈ శ్రీమంతుడు హీరోయిన్ హైదరాబాద్ లో చక్కర్లు కొడుతుందంట.
ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో కాటమారాయుడు సినిమాలో మెరిసింది. ఆ తర్వాత సినిమాలు చెయ్యను లేదు హైదరాబాద్ లో కనిపించింది లేదు. తన బాయ్ ఫ్రెండ్ తో కొన్నాళ్ళు ఫారిన్ లో కొన్నాళ్ళు తమిళ్ నాడు లో ఉంటోంది తప్ప హైదరాబాద్ మొహం చూసి ఎరుగలేదు. మరి సడెన్ గా ఇప్పుడు ఈమె హైదరాబాద్ వచ్చి ఏం చేస్తున్నట్టు అని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం వెతకగా తెలిసింది ఏంటయ్యా అంటే ఈమె చిన్న ట్రిప్ వేస్తోందట. ఈ ట్రిప్ లో హైదరాబాద్ లో ఉంటున్న కొంతమంది హీరోలను కూడా కలవనుంది.
కానీ ఉన్నట్టుండి హైదరాబాద్ వైపు మనసు ఎందుకు మళ్లింది? పైగా హీరో లతో ఇప్పుడు ఈమెకు ఏంటి పని? సినిమాలు రావట్లేదు కదా ఇప్పుడు ఈమె నటించడానికి సిద్ధంగా ఉందని హింట్ ఇవ్వడానికి అని కొందరు అంటున్నారు. అదేం లేదు. బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి అనో లేదా మరో శుభవార్త చెప్పడానికో వచ్చిందని కొందరు అంటున్నారు. మరి శృతి కి హైదరాబాద్ ఎందుకు గుర్తొచ్చిందంటారు?