Begin typing your search above and press return to search.
బ్రాకెట్లలో ఆ నంబర్లెందుకంటున్న శ్రుతి
By: Tupaki Desk | 28 Jan 2018 5:26 PM GMTఫిలిం సెలబ్రెటీల వయసు గురించి ఎప్పుడూ ఎందుకు చర్చ జరుగుతుందో తనకు అర్థం కాదని అంటోంది శ్రుతి హాసన్. ప్రతి దానికీ వయసుతో ముడిపెట్టడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడింది. ఆదివారం 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రుతి ఒక ఇంటర్వ్యూలో తన వయసు ప్రస్తావన వచ్చేసరికి అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా వాళ్ల దృష్టి ఎప్పుడూ ఫిలిం సెలబ్రెటీల వయసు మీదే ఉంటుందని.. టామ్ క్రూయిజ్ గురించి రాస్తూ బ్రాకెట్లో వయసు రాస్తారని.. ఫలానా హీరోయిన్ వయసు 23 ఏళ్లు అంటూ మొదలుపెడతారని.. ఇలా ఎప్పుడూ వయసు గురించే ఎందుకు మాట్లాడతారో తనకు అర్థం కాదని.. మనం చేసే పనికి వయసుకు సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించింది.
ఈ పుట్టిన రోజును తాను లాస్ ఏంజెల్స్ లో స్నేహితులతో కలిసి ఆస్వాదిస్తున్నట్లు చెప్పిన శ్రుతి.. ఈ రోజు తాను పెద్దగా పార్టీ చేసుకోవట్లేదని.. సాయంత్రం స్నేహితులతో కలిసి డిన్నర్ మాత్రం చేస్తానని చెప్పింది. కెరీర్లో మంచి ఫాంలో ఉన్నపుడు ఏం ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేసుకుపోయానని.. దేని గురించీ ఆలోచించే తీరిక లేదని.. కానీ గత ఏడాది రెండు వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొన్న నేపథ్యంలో తాను కొంచెం ఆగి వెనక్కి వెళ్లి.. తన కెరీర్ గురించి పున:సమీక్షించుకోవాలని భావిస్తున్నట్లు శ్రుతి తెలిపింది. అందుకే తాను ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లేదని చెప్పింది. తన జీవితంలో సంగీతానిది కూడా కీలక పాత్ర అని.. దానికి కూడా సమయం కేటాయిస్తూ జీవితంలో సమతూకం పాటించాలని భావిస్తున్నట్లు శ్రుతి చెప్పింది.