Begin typing your search above and press return to search.

పెళ్ళి వార్తలపై శృతి సెటైర్!

By:  Tupaki Desk   |   4 Jan 2019 11:00 PM IST
పెళ్ళి వార్తలపై శృతి సెటైర్!
X
ఒక ఫేజ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఈమధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కొందరేమో శృతికి ఆఫర్లు తగ్గిపోయాయని అంటారు గానీ మరికొందరు మాత్రం శృతి తనంతట తానే సినిమాలను తగ్గించుకుందని.. దానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే అని అంటున్నారు. ఏది నిజమో తెలియదు గానీ సినిమాలు తగ్గిపోయాయన్నది మాత్రం వాస్తవం.

ఇదిలా ఉంటే ఈమధ్య లండన్లో తన ప్రేమికుడు మైఖేల్ తో గడుపుతూ ఉన్న అందమైన క్షణాల తీపిగుర్తులైన ఫోటోలను అదేపనిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో శృతి త్వరలో మైఖేల్ ను పెళ్ళి చేసుకోబోతోందని చాలామంది నెటిజనులు అనుకున్నారు. ఇక ఒక తెలుగు వెబ్ సైట్ వారు కాస్త ఆవేశపడి 2019 లో శృతి పెళ్ళి చేసుకోబోతోందని ఒక పెద్ద ఆర్టికల్ రాసేశారు. ఆ ఆర్టికల్ లింక్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోట్ చేసి.. "నిజంగానా.. అయితే ఇది నాకు న్యూసే" అంటూ ఒక సెటైర్ వేసింది.

ఈలెక్కన పెళ్ళి సంగతి ఇంకా కన్ఫాం కానట్టే. అయినా బాయ్ ఫ్రెండ్ తో అలా తిరుగుతూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? నెక్స్ట్ స్టెప్ పెళ్ళి అని అనుకోక నెగెటివ్ గా థింక్ చేసి 'నెక్స్ట్ బ్రేక్ అప్' అని అనుకోరు కదా? శృతి పెళ్ళి సంగతి పక్కనబెడితే ఈమధ్యే ఒక బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.