Begin typing your search above and press return to search.

నా పెళ్లి నా ఇష్టం అంటున్న గబ్బర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   3 Jun 2018 8:44 AM GMT
నా పెళ్లి నా ఇష్టం అంటున్న గబ్బర్ బ్యూటీ
X
ఓ నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు కొట్టేసి సూపర్ హిట్స్ తో పాటు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కమల్ తనయ శృతి హాసన్ తక్కువ టైంలోనే స్పీడ్ తగ్గించేసింది. వరసగా వెంటాడిన పరాజయాలతో పాటు బాలీవుడ్ లో వేసిన ట్రైల్స్ అన్ని బోల్తా కొట్టడంతో అట్టే కష్టపడకుండా బాయ్ ఫ్రెండ్ మైకేల్ కర్సోల్ తో డేటింగ్ లో బిజీగా ఉంది. అయినా అదేమి చాటుగా చేయటం లేదు. షాపింగ్ ఫంక్షన్ కారణం ఏదైనా తాను లేకుండా దాదాపు బయట కనిపించడం లేదు. ఇది అమ్మ సారికకు నాన్న కమల్ హాసన్ కు తెలిపే శృతి ఇదంతా చేయటం విశేషం. పోనీ పెళ్లి చేసుకోవచ్చుగా అంటే మాత్రం అంతెత్తున లేస్తోంది.అసలు పెళ్ళికి ఏం తొందరొచ్చిందని అడుగుతున్నారు అని రివర్స్ కొశ్చన్ వేస్తోంది.

అక్కడితో ఆగడం లేదు. ఇలాంటి ప్రశ్నలు హీరోలకు ఎందుకు వేయరని కౌంటర్ఇస్తోంది .ఆడమగలో ఇద్దరు ఒకటే అయినప్పుడు తమను మాత్రమే అడగటంలో ఉద్దేశం ఏంటని నిలదీస్తోంది . అయినా సదరు మైకేల్ కూడా హీరో అయ్యుంటే ఈ ప్రశ్న ముందు అతన్నే అడిగేవాళ్ళు కానీ ఆ ఛాన్స్ లేదు కాబట్టి శృతిని అడుగుతున్నారు అనే లాజిక్ మిస్ అవుతోంది. అమ్మనాన్న పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కనక తొందరపడకుండా టైం చూసుకుని పెళ్లి చేసుకుంటాను అని చెబుతోంది. గబ్బర్ సింగ్ బ్యూటీగా ఫాన్స్ కి గుర్తుండిపోయిన శృతి హాసన్ రవితేజతో తేరి రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇద్దరు కలిసి గతంలో నటించిన బలుపు సూపర్ హిట్ అయిన సంగతి గుర్తేగా.