Begin typing your search above and press return to search.
వాళ్ళు నాలుగేళ్ళకే మొదలుపెట్టారు: శృతి
By: Tupaki Desk | 26 Aug 2018 9:05 AM GMTకమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపే సాధించింది. హిందీ, తెలుగు తమిళ సినిమాల్లో నటించి సక్సెస్ కూడా సాధించింది. తెలుగులో టాప్ హీరోయిన్ అయింది అనుకున్న దశలో ఎందుకో ఫేడ్ అవుట్ అయింది. కొంతమంది దానికి కారణం శృతి లవ్ స్టొరీ అంటారు.. మరికొంతమందేమో.. 'కాటమరాయుడు' ఫ్లాప్ అవడం అంటారు. ఏదేమైనా శృతి అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది.
ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ "నేను నాన్నతో కలిసి ఇప్పటికే చాలా సార్లు నటించాను.. ఇప్పుడు అమ్మతో కలిసి నటించాలని ఉంది. మేము ఒక ప్రొడక్షన్ హౌస్ ను నడుపుతున్నాం... కలిసి పనిచేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో." ఇక ఇద్దరు ప్రతిభావంతులైన నటులు కమల్ - సారిక ల కూతురిగా నటన విషయంలో ఒత్తిడి ఉండేదా అని అడిగితే "లేదు. ఇది నా లైఫ్. వాళ్ళను గర్వపడేలా చేయాలని మాత్రం ఉంది. ఆదిశగా నేను కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళకు నన్ను చూసి గర్వపడుతున్నారని అనుకుంటున్నాను. ఇక పోలికల విషయానికి వస్తే అవి రీచ్ అవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాలుగేళ్ల వయసులోనే నటన మొదలు పెట్టారు. అసలు వాళ్ళ రేంజ్ లో ఆలోచించడమే కష్టం. అందుకే పోలికల గురించి నేను అసలు పట్టించుకోను."
శృతి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పదేళ్లయింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఈ పదేళ్ళలో చాలా గ్రోత్ వచ్చిందని, వ్యక్తిగతంగా కూడా తనలో చాలా మార్పు వచ్చిందని ఒక బెటర్ పర్సన్ గా మారానని తెలిపింది. శృతి రీసెంట్ గా ల్యాక్మే ఫాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2018 లో నాలుగవ రోజున ర్యాంప్ వాక్ చేసింది. సాక్ష్య & కిన్ని డిజైన్ చేసిన 'రాస్' దుస్తుల్లో తళుక్కున మెరిసింది.