Begin typing your search above and press return to search.

శృతి డ్రెస్సులు అందుకోసం వేయదట

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:05 AM GMT
శృతి డ్రెస్సులు అందుకోసం వేయదట
X
అమ్మాయిలు అందంగా తయారయ్యేది అబ్బాయిలు చూడ్డానికే.. అందాలు కుమ్మరించేలా సింగారించేది వాళ్లకు చూపించడానికే. ఇదే చాలామంది ఒపీనియన్. కొంతమంది నిలువుటద్దం ముందు నుంచుని తెగ మురిసిపోతూ ఉంటారు. మరికొంత మంది అబ్బాయిలకు చూపించి.. వారి నేత్రానందం కోసం డ్రెసింగ్ చేస్తారు.

కానీ శృతి హాసన్ మాత్రం ఈ విషయంలో కొత్తగా చెబుతోంది. తనకు స్టైల్ ఉండడమంటే ఇష్టమంటూ.. వెరైటీ డ్రస్సులు ట్రై చేసేందుకు ఏ మాత్రం వెనకాడనని అంటోంది. 'నేను అబ్బాయిల కోసం మాత్రం డ్రెసింగ్ చేసుకోను. అందమైన దుస్తులు వేసుకుని వాళ్లను ఆకర్షించాలని అనుకోను. నేను బయటకు వెళ్తే షాపింగ్ మాల్స్ లో కనిపించే పెద్ద పెద్ద అద్దాల్లో చూసుకోవడం ఇష్టం. వాటిలో నన్ను నేను చూసుకోవడానికి డ్రెస్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో అద్దాలు ఉన్నా మాల్స్ లో ఉండే మిర్రర్స్ లో చూసుకోవడమంటేనే నాకు ఇష్టం' అని చెప్పింది శృతి హాసన్.

డ్రస్సుల విషయంలో మరింత వేదాంతం కూడా చెప్పింది శృతి. 'నేను డ్రస్ చేసుకునేటపుడు అద్దాలను కూడా గుర్తు పెట్టుకుంటాను. డ్రెసింగ్ అనేది ఎవరి అభిరుచికి తగ్గట్లుగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం కరెక్టు కాదు. సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకునేటప్పుడు.. ఇతరులకు చూడ్డానికి బాగాలేకపోయినా వేసేసుకోవాలి' అని చెప్పింది శృతి హాసన్.