Begin typing your search above and press return to search.
నా ఫ్రెండ్సందరికీ పెళ్లిల్లు అయిపోయాయ్
By: Tupaki Desk | 27 Sep 2015 4:47 AM GMTసిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా? నావాడు ఎవరే.. ? నాతోడు ఎవరే? ఎన్నాళ్ల కొస్తాడే.. ఇదో పాపులర్ లిరిక్. ఈ పాటలోలానే శ్రుతిహాసన్ ని కూడా ఓ ప్రశ్న అడిగామనుకోండి. ఏం సమాధానం చెబుతుందో ఊహించుకోండి. చాలామంది నా ఫ్రెండ్సందరికీ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయారు. అదంతా ఓ ఫన్ అని నేను అనుకోవడం లేదు. ఒక పెద్ద స్టార్ అవ్వడం కంటే పెళ్లి చేసుకోవడం గొప్ప ఘనకార్యం అని నేను అనుకుంటున్నా. అది కూడా బోలెడంత వర్క్ అనే భావిస్తున్నా. ఒకవేళ నాక్కాబోయేవాడు ఎలా ఉండాలి? అన్న ప్రశ్న వస్తే.. . నా వాడిలో కొన్ని క్వాలిటీస్ కావాలి. ఇంటెలిజెన్స్ - లాయల్టీ - సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి .. అని కుండ బద్ధలు కొట్టింది శ్రుతి.
తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో ఏకకాలంలో బిజీగా క్షణం తీరిక లేనంతగా కాలాన్ని గడిపేస్తోంది శ్రుతి. నిన్ననే ఇంత బిజీలోనూ ఓ షాపు ఓపెనింగుకి వెళ్లింది. అక్కడ అభిమానులంతా తనని చుట్టుముట్టేసి బోలెడన్ని ప్రశ్నలు వేశారు. అందులోంచి రామబాణంలా తాకిన పెళ్లి టాపిక్ పై మాట్లాడింది. అలాగే తాజా ప్రాజెక్టుల గురించి చెబుతూ... సింగం 3 - వడి వేసల్ - వేదలం వంటి సినిమాల్లో నటిస్తున్నానని అంది.
విజయ్ పులి చిత్రంలో అతడి లవ్ ఇంట్రెస్ట్ గా నటించానని చెప్పింది. తన కెరీర్ లోనే ఫెమినైన్ క్యారెక్టర్ ఇదని రివీల్ చేసింది. అసలు సినిమా హీరోయిన్ అవుతాననే అనుకోలేదు. వెండితెరపై అందగత్తెలంతా నాచుట్టూ మూగేస్తే అందులో నేను కనబడతానా? అని సందేహించేదాన్ని. కానీ అనుకోకుండానే హీరోయిన్ అయ్యా. ఇదే సరైన దారి అని తెలుసుకున్నా.. అంటూ మరో కఠోరసత్యాన్ని ఆవిష్కరించింది.