Begin typing your search above and press return to search.

శృతి విశాల హృదయం.. బాబోయ్

By:  Tupaki Desk   |   9 Sep 2016 7:30 PM GMT
శృతి విశాల హృదయం.. బాబోయ్
X
రెండు సినిమాలు హిట్టయితే చాలు.. అసలు మన సినిమాల్లో నాయికా ప్రాధాన్యం ఉన్న కథలు రావట్లేదని.. ఉమెన్ సెంట్రిక్ సినిమాలను చేసేయాలని హాట్ హీరోయిన్లు నానా హంగామా చేసేస్తున్నారు. కాని సెక్సిణి శృతి హాసన్ మాత్రం అందుకు పూర్తిగా రివర్సులో ఉంటుంది. అమ్మడిది ఓ రేంజు విశాల హృదయం.

ఈ మధ్యనే హీరోయిన్ గా దాదాపు పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న శ్రుతిహాసన్‌.. హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనిపిస్తోందా అంటే.. అంత సీన్ లేదంటోంది. ''ఉమెన్ సెంట్రిక్ కథలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవని నా ఒపీనియన్. ప్రతీ కథలోనూ హీరోయిన్ కు ప్రాధాన్యం ఉండాల్సిందే. నా వరకూ ప్రతీ పాత్రనీ అలానే భావిస్తా. అప్పుడే నాలోని నటిని బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుంది'' అంటూ తన ఫిలాసఫీ వినిపించింది. అసలు పాటల్లో మాత్రమే మెరిసి అందాలు ఆరబోసే కథల్లోనూ కనీసం ఏదో ఒక సన్నివేశంలో తనలో ఉన్న యాక్టర్ కు టెస్ట్ పెట్టే ఛాలెంజ్ ఉంటుందట. వాటిని ఫేస్ చేయడానికి ఆమె ఇష్టపడుతుందట. అది సంగతి.

అసలు ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా.. కథంతా నా చుట్టూనే తిరగాలి అని ఆశ మాత్రం లేదని శృతి హాసన్ చెప్పడం కాస్త షాకింగానే ఉంది కదూ. కాకపోతే మరీ అమ్మడికి ఇంత విశాల హృదయమేంటి బాబోయ్ అనిపించక మానదు.