Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః శృతి భలే తయారైందే

By:  Tupaki Desk   |   17 Jan 2018 7:46 AM GMT
ఫోటో స్టోరిః శృతి భలే తయారైందే
X
ఇంకో నాలుగు నెలలుపోతే.. మనకు శృతి హాసన్ అనే ఒక స్టార్ హీరోయిన్ ఉండేది తెలుసా అని చెప్పుకోవాలేమో. అసలు సినిమాలు అనేవి సైన్ చేయకుండా.. గతేడాది కాటమరాయుడు సినిమాలో మాత్రమే కనిపించిన ఈ సెక్సీ బ్యూటి.. ఇప్పుడు మాత్రం ఎట్టకేలకు ఒక మ్యాగజైన్ కవరెక్కింది తెలుసా. పైగా అక్కడ కాస్త కొత్తగా కనిపిస్తుండటంతో.. మనం దాని గురించి చెప్పుకోవాల్సిందే.

ప్రముఖ ఫెమీనా మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ పై ఇప్పుడు సందడి చేస్తోంది శతి హాసన్. అమ్మడు షార్టు డ్రస్సులో నేలపై కూర్చున్నట్లు ఫోజివ్వడం చూస్తుంటే.. ఏదో హాలీవుడ్ మోడల్ తరహాలో ప్రయత్నించిందనే అనుకోవాలి. అంతేకాకుండా.. జుట్టు తడిసిపోయినట్లు ఆ హెయిర్ స్టయిల్ కూడా భలే గమ్మత్తుగానే ఉంది. అమ్మడు ఒక రకంగా చూస్తే.. ప్రఖ్యాత హాలీవుడ్ హీరోయిన్ మర్లిన్ మన్రో తరహాలో రసికత్వమైన హావభావాలు పలికించే ప్రయత్నం చేసింది.

ఇకపోతే లండన్ కు చెందిన మైఖేల్ కోర్సేల్ తో అమ్మడు ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటోందనే రూమర్లు ఎన్ని వచ్చినా.. స్వయంగా వారిద్దూ ఎన్ని వెడ్డింగ్స్ లో కనిపించినా కూడా.. ఎందుకో మరి వాటి గురించి శృతి పెదవి విప్పట్లేదు. అలాగే ఆమె కొత్త సినిమాలు కూడా సంతకాలు చేయట్లేదు.