Begin typing your search above and press return to search.
కవర్ చేయలేక చస్తున్న శృతి
By: Tupaki Desk | 19 Jun 2017 4:42 PM GMTఓ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో దక్షిణాది భామ శృతి హాసన్ బాగా ట్యాలెంటెడ్. ముక్కుసూటిగా.. ఓ మాత్రం మొహమాటం లేకుండా.. ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె బాడీ షేమింగ్ కు గురైంది. పెదాలను అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆపరేషన్ చేయించుకుందంటూ.. గత ఫోటోలను.. ఇప్పటి రూపాన్ని కంపేర్ చేస్తూ నెట్ జనాలు పోస్టులు చేసి వెటకారం ఆడారు.
దీనికి ఏ మాత్రం జంకకుండా నా బాడీ.. నా ఫేస్.. నా ఇష్టం అంటూ కొట్టినట్లు సమాధానమిచ్చింది శృతి హాసన్. ఈమెకు పచ్చబొట్టు(ట్యాటూ)ల పిచ్చి కూడా కాసింత ఎక్కువే. ఆ విషయాన్ని స్పృసిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమెను ఓ ప్రశ్న ఎదురైంది. తన ఒంటి మీద మరో ట్యాటూ వేయించుకునేందుకు శృతి సిద్ధమేనా అన్న ప్రశ్నకు.. అందరూ ఈమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ ఆశించారు. కానీ శృతి హాసన్ మాత్రం ఆశ్చర్యకరంగా రివర్స్ లో సమాధానం ఇచ్చింది. 'ఇప్పటికే నా ఒంటి మీద ఐదు ట్యాటూలు ఉన్నాయి. మణికట్టు దగ్గర.. చెవి వెనక.. పాదం పైనా.. వెన్ను మీదా.. భుజం పైనా ట్యాటూలు ఉన్నాయి. వీటన్నిటినీ వేయించుకున్నందుకు తెగ బాధపడుతున్నా' అనేసింది శృతి హాసన్.
ఇంతకీ ట్యాటూలతో ఈమెకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారా? ముఖ్యంగా మణికట్టు దగ్గర ఉన్న ట్యాటూ కనిపించకుండా చేసేందుకు.. బోలెడంత మేకప్ వేసుకోవాల్సి వస్తోందట. అటు టైం ఎక్కువ పట్టడంతోపాటు.. స్కిన్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తోందని.. 'కవర్ చేయలేక చస్తున్నా' అంటూ శృతి తెగ బాధపడిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/