Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు.. అందాలతో అరిపించేశారు

By:  Tupaki Desk   |   1 July 2016 6:27 AM GMT
ఆ ముగ్గురు.. అందాలతో అరిపించేశారు
X
అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే అందరి కళ్లూ అక్కడే ఉంటాయి. ఎవరెవరికి ఏ అవార్డ్ వచ్చిందో చూద్దామనే ఆతృత కొందరిదైతే.. ఇలాంటి వేడుకల్లో అందాల భామలంతా ఒకేచోటకు చేరతారనే ఆశ మరికొందరికి ఉంటుంది. మరి ఇంతలేసి మంది సుందరీమణులు ఒకే ప్లేస్ లో కనిపించే ఛాన్స్ తక్కువసార్లే వస్తుంది. అలా సింగపూర్ లో జరిగిన సైమా అవార్డుల వేడుక.. అందాల ప్రదర్శనకు వేదికగా మారింది.

సౌత్ సుందరాంగులు ఇక్కడ చాలామందే మెరిశారు కానీ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ముగ్గురు మాత్రం ఇక్కడ అందాలతో వెలుగులు విరజిమ్మేశారు. మొదటగా అయితే సమంత డ్రెసింగ్ గురించే చెప్పుకోవాలి. బార్బీ టైపు డ్రెసింగ్ తో శామ్స్ అదరగొట్టేసింది. వైట్ అంట్ వైట్ గౌన్ అమ్మడికి భలేగా సెట్ అయింది. గ్లామ్ డాల్ అవతారంలో చాలా రోజులకు కనిపించడంతో.. సమంత ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. ఇక బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్న శృతి హాసన్ అయితే.. గ్రీన్ లో మెరిసిపోయింది. ట్రాన్స్ పరెంట్ స్లీవ్స్.. బ్యాక్ లెస్ షోకులు.. అబ్బో శృతి లెక్క చాలా స్పెషల్ గా ఉంది.

ఇక కుర్ర భామ రకుల్ ప్రీత్ సింగ్ అయితే కేకలు పెట్టించేసింది. బుద్ధిగా చీరకట్టుకు వచ్చినట్లు కనిపించే.. బొడ్డు కనిపించేలా కట్టు.. జాకెట్ లోపలి నుంచి పవిట.. స్లీవ్ లెస్ చేతులు.. క్లీవేజ్ అందాలు.. మొత్తం మీద ఏ యాంగిల్ నుంచి చూసినా రకుల్ సోకులు అద్భుతంగానే ఉన్నాయి. ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా తయారైపోయి.. అభిమానులకు అందాల విందు చేశారు ఈ హీరోయిన్లు.