Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌.. గౌత‌మి బ్రేక‌ప్‌ పై శృతి స్పందించింది

By:  Tupaki Desk   |   2 Nov 2016 9:27 AM GMT
క‌మ‌ల్‌.. గౌత‌మి బ్రేక‌ప్‌ పై శృతి స్పందించింది
X
క‌మ‌ల్‌ హాస‌న్ నుంచి గౌత‌మి విడిపోవ‌డం ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ బ్రేక‌ప్‌ కి కార‌ణం క‌మ‌ల్ త‌న‌య శృతిహాస‌నే అన్న ప్ర‌చారం ఊపందుకొంది. ఆ విష‌యం శృతి చెవిన కూడా ప‌డింది. దాంతో వెంట‌నే ఆమె స్పందించింది. అయితే ఆ స్పంద‌న మాత్రం ముక్కుసూటిగా లేదు. ఇలాంటి విషయాల‌పై ఇంత‌కంటే ఎక్కువ‌గా మాట్లాడ‌కూడ‌ద‌న్న‌ట్టుగా స్పందించిందామె. తన ప్ర‌తినిధి నుంచి ఓ చిన్న సందేశం మీడియాకి పాస్ చేయించింది.

``ఒక‌రి వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడ‌టం నాకు ఇష్ట‌ముండ‌దు. ఎవ‌రి జీవితం వాళ్ల‌ది. ఎవ‌రి నిర్ణ‌యాలు వాళ్ల‌వి. అయితే నా కుటుంబాన్ని నేనెప్పుడూ ప్రేమిస్తుంటా. నా త‌ల్లిదండ్రులు - నా చెల్లెలు అంటే నాకెప్పుడూ అభిమాన‌మే. ఇక మిగ‌తా విష‌యాల గురించి నాకు అన‌వ‌స‌రం`` అని ఆమె స్ప‌ష్టం చేసింది. అంతే త‌ప్ప త‌న తండ్రి - గౌత‌మి త‌న వ‌ల్లే విడిపోయార‌నే ప్ర‌చారంపై మాత్రం ఆమె అస్స‌లు స్పందించ‌లేదు. అస‌లు గౌత‌మి ఎవ‌రో నాకు తెలియ‌దన్న‌ట్టుగా స్పందించింది. అయితే ఈ వ్య‌వ‌హారం విష‌యంలో సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాత్రం గౌత‌మి ప‌ట్లే సానుకూలంగా ఉన్నాయి. సింప‌తి కోస‌మో - లేదంటే ఎవ‌ర్నో నిందించ‌డానికో తాను ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని గౌత‌మి నిన్న ఆమె త‌న బ్లాగ్‌ లో పేర్కొన్న‌ప్ప‌టికీ సినీ వ‌ర్గాలు మాత్రం గౌత‌మికి అండ‌గా నిల‌వాల్సిన స‌మయ‌మిది అన్న అబిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/