Begin typing your search above and press return to search.
శ్రుతి.. గౌతమి పేరెత్తకుండానే
By: Tupaki Desk | 31 Aug 2016 1:30 PM GMTకమల్ హాసన్ కు గౌతమి ఏమవుతుందో నిర్వచించలేం. ఆమె ఆయనకు భార్య కాని భార్య. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు కానీ.. భార్యాభర్తల్లాగే ఉంటున్నారు. ఇద్దరి మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. వారి ఆలోచనలు కలిశాయి. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్.. అక్షర హాసన్ లకు కూడా ఆమెతో ఎలాంటి ఇబ్బందీ లేదు. సఖ్యతతోనే మెలుగుతున్నారు. మొన్నటిదాకా ఏ గొడవలూ లేవు.
ఐతే ఈ మధ్య ‘శభాష్ నాయుడు’ సినిమాకు సంబంధించి కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమికి.. శ్రుతికి ఏదో గొడవ జరిగినట్లుగా వార్తలొచ్చాయి. గత కొన్నేళ్లుగా కమల్ ప్రతి సినిమాకూ గౌతమీనే కాస్ట్యూమ్ డిజైనర్. ‘శభాష్ నాయుడు’ కోసమని శ్రుతితో ఆమె తొలిసారి పని చేసింది. ఐతే తనకు డిజైన్ చేసిన దుస్తుల విషయంలో శ్రుతి.. గౌతమితో గొడవ పడ్డట్లు వార్తలొచ్చాయి. దీనిపై శ్రుతి వైపు నుంచి మీడియాకు క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు శ్రుతినే మీడియాతో నేరుగా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
‘‘శభాష్ నాయుడు విషయంలో మా మధ్య చర్చలు నడిచాయి కానీ గొడవలు కాదు. మేమందరం కలిసి ఒక మంచి లుక్ ఫైనలైజ్ చేశాం. ఇది టీమ్ ఎఫర్ట్. నా గురించి వచ్చే రూమర్ల గురించి పట్టించుకుంటూ పోతే నేను పని చేయలేను. ఇక్కడిదాకా వచ్చేదాన్నే కాదు. నేను చాలాసార్లు చెప్పాను. మా నాన్న నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని. ఆయనకు ముఖ్యమైన వ్యక్తిని నేను గౌరవించకుండా ఎలా ఉంటాను’’ అంటూ గౌతమి పేరెత్తకుండానే ఆమెపై తనకున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పింది శ్రుతి.