Begin typing your search above and press return to search.

అంద‌రి దారి వేరు.. అందాల భాగ్య‌ల‌క్ష్మి దారి వేరు!

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 AM GMT
అంద‌రి దారి వేరు.. అందాల భాగ్య‌ల‌క్ష్మి దారి వేరు!
X
క‌మల్ హాస‌న్ వార‌సురాలు శ్రుతి హాస‌న్ మ‌ల్టీ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌థానాయిక‌గా శ్రుతి స్థానం గురించి తెలిసిన‌దే. తండ్రి సూచ‌న‌లు... స‌ల‌హాల‌తో ఆరంభ‌మే శ్రుతి రాటు దేలింది. మంచి న‌టిగా... డాన్స‌ర్ గా... సింగ‌ర్ గా..డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా త‌న ట్యాలెంట్ ను ప్రూవ్ చేసింది. శ్రుతి హాస‌న్ వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త‌ ఆరంభంలోనే ప్రూవ్ అయ్యింది.

తాజాగా ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా శ్రుతి త‌న బ్రిలియ‌న్సీని చూపించింది. లాక్ డౌన్ స‌మ‌యంలో హీరోయిన్లంతా ఫిట్ నెస్ ఆరోగ్యం పై దృష్టి సారించి జిమ్ .. యోగా అంటూ గంట‌ల త‌ర‌బ‌డి స‌మ‌యం కేటాయిస్తున్నారు. అయితే శ్రుతి హాస‌న్ మాత్రం వాటిని అనుస‌రిస్తూనే కొత్త మార్గాన్ని క‌నిపెట్టింది. మై ఫిట్ నెస్ సీక్రెట్ అంటూ డాన్స్ ల ప్రాక్టీస్ చేసిందిట‌.

డాన్స్ అనేది హీరోయిన్లు అంద‌రూ చేసేదే క‌దా అనే సందేహం రావొచ్చు . కానీ శ్రుతి వేరే క‌దా. తాను స్వ‌త‌హాగానే సంగీత ప్రియురాలు. దానికి త‌గ్గ‌ట్టు 90వ ద‌శ‌కంలో పాత పాట‌ల‌కు స్టెప్పులేస్తూ ఫిట్ నెస్ తో పాటు..ఆరోగ్యాన్ని కాపాడుకుంటోందిట‌. నిర్విరామంగా కొన్ని గంట‌లు పాటు పాత పాట‌ల‌కు డాన్స్ చేస్తుంటే మంచి ప్రాక్టీస్ తో పాటు ఎంట‌ర్ టైన్ మెంట్ దొరుకుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఈ విధంగా చేయ‌డంలో వ‌ల్ల నృత్యంలో మెళ‌కువ‌లు మెరుగ‌వుతున్నాయి.. అటు ఫిట్ నెస్ కాపాడుకోగ‌లుగుతున్నామ‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రుతి హాస‌న్ కరోనా సెకెండ్ వేవ్ ని ఇలా ప్లాన్ చేసిందిన్న మాట‌. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ `స‌లార్` లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్ లో `లాభ‌మ్` అనే చిత్రంలో న‌టిస్తుంది.