Begin typing your search above and press return to search.

మిల్కీ - శృతి బంధం.. డౌట్లొస్తున్నాయ్‌!

By:  Tupaki Desk   |   15 March 2019 6:07 AM GMT
మిల్కీ - శృతి బంధం.. డౌట్లొస్తున్నాయ్‌!
X
శృతి హాస‌న్ - మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా మ‌ధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు ఎదురు ప‌డితే చుట్టూ ఎంద‌రు ఉన్నా ప‌ట్టించుకోరు. అప్ప‌ట్లో ఓ విమానాశ్ర‌యంలో ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు ఎదురు ప‌డిన‌ప్ప‌టి సంఘ‌ట‌న‌ను కూడా జ‌నం అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇలా ఎదురు ప‌డ‌డ‌మే ఆల‌స్యం... అలా ఒక‌రినొక‌రు కౌగిలించుకుని ముద్దాడేసుకోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎంత స్నేహితులు అయినా మ‌రీ ఇలా ప‌బ్లిగ్గానా? అంటూ రెండు వారాల పాటు దానిపైనే గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే అది స్నేహాన్ని మించిన ప్రేమ కాబోలు అనుకున్నారంతా. తాజాగా శృతి ఇచ్చిన స్టేట్ మెంట్ తో అంత‌కుమించి అని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది. 'మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ ని పెళ్లాడ‌తారు?' అంటూ ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో శృతిని ప్ర‌శ్నిస్తే షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చింది అమ్మ‌డు. 'ఇంకెవ‌రు? త‌మ‌న్నాని పెళ్లాడేస్తాను. త‌నంటే అంత ఇష్టం. చాలా మంచిది.. అస్స‌లు వ‌దిలి పెట్టేదానిని కాదు!!' అంటూ కితాబిచ్చేసింది. ఒక‌వేళ ఇదే ప్ర‌శ్న త‌మ‌న్నాని అడిగేసినా శృతిని పెళ్లాడేస్తాన‌ని అంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఇక బాలీవుడ్ కెరీర్ గురించి శృతి మాట్లాడుతూ అస‌లు తాను ఏ అవ‌గాహ‌నా లేని టైమ్ లో బాలీవుడ్ లో ప్ర‌వేశించాన‌ని, అది త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని అంది.

ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వాళ్లు ఉన్నారు. శృతి సినిమాలు వ‌దిలేసి మ్యూజిక్ బ్యాండ్, ప‌ర్స‌న‌ల్ లైఫ్ అంటూ కాల‌క్షేపం చేస్తోంది. చిరు- కొర‌టాల శివ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌న్న ప్ర‌చారం ఉన్నా అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. మ‌రోవైపు త‌మ‌న్నా మాత్రం వ‌రుస‌గా అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించేస్తూ బిజీగా ఉంది. ఎఫ్ 2 త‌ర్వాత శృతి మ‌రోసారి ఇన్నింగ్స్ లో అనూహ్య‌మైన స్పీడ్ ని పెంచేసింది. శృతి- త‌మ‌న్నా బాండింగ్ చూశాక‌.. కొంద‌రు కొంటెగా మ‌రీ ఇంత లెస్బియ‌న్ ప్రేమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.