Begin typing your search above and press return to search.
మనలోని పిల్లాడిని గట్టిగా కౌగిలించుకోవాలి-శ్రుతి
By: Tupaki Desk | 20 Dec 2020 5:30 PM GMTబాల్యంలో జ్ఞాపకాలు మధురాతిమధురం. అపరిమితమైన గొప్ప అనుభూతులు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటే ఎంతో ఎగ్జయిట్ అవుతుంటాం. ఇప్పుడు అలాంటి ఎగ్జయిట్ మెంట్ లోనే ఉంది అందాల శ్రుతిహాసన్. తన బాల్యాన్ని నెమరు వేసుకుంటూ ఇదిగో ఇలాంటి క్యూట్ ఫోటోని అభిమానులకు ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది శ్రుతి.
స్కూల్ డేస్ లో ఎంతో క్యూట్ గా వైట్ అండ్ వైట్ యూనిఫామ్ లో ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. ఫ్రెండుతో ఎంతో ముద్దుముద్దు మాటలు చెబుతోంది. ఇలాంటి అరుదైన జ్ఞాపకాన్ని ఫోటోల రూపంలో దాచుకున్న శ్రుతిని అభినందించాల్సిందే.
``మినీ మీ (చిన్నప్పటి నేను).. ఆ కళ్ళలో ఆ గుండెలో కలలు .. చాలా బిగ్గరగా వినిపించే గొంతు! నోథింగ్స్ నిజంగా మారిపోయాయి-పిల్లల్లో ఒక నిర్దిష్ట స్థాయి అమాయకత్వాన్ని మీలో సజీవంగా ఉంచడం చాలా కష్టతరమైన బహుమతి సాధించే అభ్యాసం. మనమందరం లోపల ఉన్న చిన్న పిల్లవాడిని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకోవాలి. కాబట్టి మీలోని మినీకి హాయ్ చెప్పండి. అందంగా ఎంతో బావుంటుంది..`` అంటూ ఎంతో క్యూట్ గా చెప్పింది శ్రుతి.
అన్నట్టు శ్రుతి ఇంతింతై ఎదిగేసింది. గాయనిగా.. కథానాయికగా రాణించింది. ఇంకా తండ్రి కమల్ హాసన్ బాటలో బోలెడన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తను నటించిన క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రుతి కంబ్యాక్ అవుతోంది. తెలుగు-తమిళం-హిందీలో కథానాయికగా బిజీ అవుతోంది.