Begin typing your search above and press return to search.

బ్లాక్ కాన్సెప్ట్ తో న‌ట‌వార‌సురాలి ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   30 Oct 2021 11:30 PM GMT
బ్లాక్ కాన్సెప్ట్ తో న‌ట‌వార‌సురాలి ప్ర‌యోగం
X
అందాల శ్రుతి హాస‌న్ కెరీర్ మ‌ళ్లీ ట్రాక్ మీద‌కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. `క్రాక్` స‌క్సెస్ తో ఈ న‌ట‌వార‌సురాలు ఫుల్ స్వింగ్ లోకి వ‌చ్చేసింది. వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్ హీరోల స‌ర‌స‌న‌ బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవ‌లే `వ‌కీల్ సాబ్` తోనూ మంచి స‌క్సెస్ అందుకుంది.

మ‌రోవైపు శ్రుతి వ‌రుస ఈవెంట్ల‌లో వెరైటీ మేక‌ప్ తో ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. పాశ్చాత్య తార‌ల్ని వెస్ట్ర‌న్ స్టైల్స్ ని అనుక‌రిస్తూ స‌రికొత్త మేక‌ప్ విష‌యాల‌ను ప్ర‌మోట్ చేస్తోంది. తాజాగా బ్లాక్ లెద‌ర్ తో రూపొందించిన డిజైన‌ర్ లుక్ లో శ్రుతి కనిపించింది. టాప్ టు బాట‌మ్ బ్లాక్ కాన్సెప్టుతో శ్రుతి ఆక‌ట్టుకుంది. త‌న చేతి వేళ్ల‌కు వేసుకున్న నెయిల్ పాలిష్ కూడా న‌ల్ల రంగుదే కావ‌డం విశేషం. ఇక ఆ బ్లాక్ లెద‌ర్ జాకెట్ ని ఒక డిజైన‌ర్ గౌను త‌ర‌హాలో రూపొందించిన స్టూడియోకి ప్ర‌త్యేక క్రెడిట్ ద‌క్కుతుంది. ప్ర‌యోగాల‌కు ఎంత‌మాత్రం వెన‌కాడ‌ని శ్రుతికే ఇది సాధ్య‌మైంది అనేలా ఈ లుక్ ఆక‌ట్టుకుంటోంది.

కెరీర్ ప‌రంగానూ శ్రుతి ప్ర‌యోగాలు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రుతి లైన‌ప్ చూస్తే సీనియ‌ర్ స్టార్ హీరోల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `స‌లార్` లో న‌టిస్తోంది. శ్రుతి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా కేట‌గిరీ చిత్రం కావ‌డం విశేషం. సినిమా రిలీజ్ అయి హిట్ అయితే త‌న‌ క్రేజ్ అంత‌కంత‌కు పెరిగ‌పోవ‌డం ఖాయం. తాజాగా అమ్మ‌డి ప్లానింగ్ చూస్తే మ‌రింత వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త క‌నిపిస్తోంది. నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో శ్రుతినే హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇది బాల‌కృష్ణ‌ 107వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ నేప‌థ్యంలో శ్రుతిహాస‌న్ కి భారీ పారితోషికం ఆఫ‌ర్ చేసి ఆమెని ఎంపిక చేసిన‌ట్లు చ‌ర్చ సాగుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ కి కూడా శ్రుతి హాస‌న్ నే లాక్ చేసిన‌ట్లు గుస గుస వినిపిస్తోంది. మ‌రి శ్రుతి హాస‌న్ బ్యాక్ టు బ్యాక్ ఇలా సీనియ‌ర్ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తోంది? అంటే పారితోషికంలో హైప్ కార‌ణ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

చిరు..బాల‌య్య లాంటి వెట‌ర‌న్స్ కి ఆ ఏజ్ హీరోయిన్లు సెట్ చేయ‌డం ప్ర‌తీసారి ద‌ర్శ‌కుల‌కు ఇబ్బందిగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌య‌సు వ్య‌త్యాసంతో ఇబ్బంది ఉన్నా... అగ్ర‌ హీరోల‌కు క్రేజీ హీరోయిన్ నే తీసుకోవాలి. ఫాంలో ఉన్న కొంత మంది హీరోయిన్లు ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ల‌తో న‌టించ‌డానికి అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని గ‌తంలో క‌థ‌నాలు వేడెక్కించాయి. స‌రిగ్గా ఈ పాయింట్ నే శ్రుతి హాస‌న్ ఎన్ క్యాష్ చేసుకుంటుందా? అంటూ డౌట్ రెయిజ్ అవుతోంది. ఆ ప్రాజెక్ట్ లు అధికారికంగా శ్రుతి ఖాతాలో ప‌డితే ఊహించిన‌దే నిజం అవుతుందేమో.