Begin typing your search above and press return to search.
భర్తతో కలిసి శృతి హాసన్ లంచ్
By: Tupaki Desk | 6 May 2016 9:24 AM GMTసినిమాల్లో ఓ కేరక్టర్ ఇంకో కేరక్టర్ ను టీజ్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ మధ్య ఛానల్స్ వాళ్లు కూడా జనాలను టీజ్ చేయడం బాగానే మొదలుపెట్టారు. ఇప్పుడు సౌత్ సుందరి శృతి హాసన్ కూడా అభిమానులను ఆటపట్టించే పెట్టుకుంది. 'నేను భర్తతో కలిసి లంచ్ చేశా' అంటూ శృతి హాసన్ ఫేస్‌బుక్ ఎకౌంట్ చేసిన పోస్ట్.. వైరల్ అయిపోయింది.
అదేంటీ.. భర్తతో కలిసి శృతి హాసన్ భోజనం చేయడం ఏంటి? అంటే. శృతికి పెళ్లయిపోయిందా? ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుందా? పెళ్లెప్పుడు జరిగింది? ఎవరితో జరిగింది?.. అబ్బో ఇలా తెగ మెసేజ్ లు వచ్చేశాయి. ఇలా బోలెడంత మంది అభిమానులు కంగారు పడిపోయి.. ఆన్సర్ కోసం ఆత్రంగా ఎదురు చూశారు. ఇలా కాసేపు గడిచాక.. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది అమ్మడు. ఇంతకీ సంగతేంటంటే.. తన ఫ్రెండ్ - బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ కం లిరిక్ రైటర్ అయిన నిరంజన్ అయ్యంగార్ తో కలిసి.. సరదాగా లంచ్ కి వెళ్లింది శృతి హాసన్.
అక్కడ లంచ్ మెనూలో.. పేర్లన్నీ వెరైటీగా కనిపించాయి. హాలీవుడ్ అమెరికన్ డ్రామా సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్ లో కేరక్టర్లు - ఎపిసోడ్స్ పేరుతో ఐటెమ్స్ కనిపించాయి. ఇదంతా థ్రిల్లింగ్ గా అనిపించి.. తను కూడా ఫ్యాన్స్ ని థ్రిల్ చేద్దామని భావించిందట శృతి. అందుకే సరదాగా అలా అన్నానంటూ ఆఖర్లో చెప్పింది అమ్మడు. అప్పుడు కానీ అభిమానులు శాంతించలేదు.