Begin typing your search above and press return to search.

ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండ‌టానికి కార‌ణం అదే: శ్రుతి హాస‌న్‌

By:  Tupaki Desk   |   26 Nov 2022 11:30 PM GMT
ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీలో ఉండ‌టానికి కార‌ణం అదే: శ్రుతి హాస‌న్‌
X
లోకనాయకుడు కమల్ హాసన్ - సారికల ముద్దుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా ఈ అమ్మడు కెరీర్‌ ప్రారంభించి పదేళ్లకు పైనే అయింది. అయినా సరే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ బిజీ బ్యూటీగా గడుపుతోంది. న‌టిగా కాకుండా మంచి సింగ‌ర్ గానూ గుర్తింపు పొందింది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఈ భామ మూడు పెద్ద ప్రాజెక్ట్స్ లో భాగమైంది. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ 'సలార్' ఒకటి. అలాగే మరోవైపు నట‌సింహ నందమూరి బాలకృష్ణకు జోడిగా 'వీర సింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి సరసన 'వాల్తేరు వీరయ్య' చిత్రాల్లో నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మితమవుతున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక రీసెంట్ గా శ్రుతి హాసన్ హాలీవుడ్ లో సైతం ఓ అదిరిపోయే ఆఫర్ ను ప‌ట్టేసింది. హాలీవుడ్ లో ఈ అందాల సోయ‌గం 'ది ఐ' అనే సైకలాజికల్ థ్రిల్ల‌ర్ మూవీలో నటిస్తోంది.

డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ‌ర వేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇకపోతే తాజాగా శ్రుతి హాస‌న్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. అలాగే తాను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణాన్ని ఏంటో సైతం వివరించింది.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. నచ్చినట్లు పని చేసుకుంటూ వెళ్లడమే ఇండస్ట్రీలో త‌న‌ ఇన్నేళ్ల ప్ర‌యాణానికి కారణమ‌ని తెలిపింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో స్టార్ హీరో కూతురిగా సెట్స్ లో తానెలా ప్రవర్తిస్తానో అని అనుకునేవారు. కానీ తానెప్పుడూ ఒకరి ఊహలకు, అంచనాలకు అందలేద‌ని ఆమె తెలిపింది.

తాను త‌న‌లానే ఉంటూ వచ్చాన‌ని, చేసే పనిని ప్రేమించాన‌ని, సహనటుల‌తో స్నేహంగా మెలిగాన‌ని శ్రుతి చెప్పుకొచ్చింది. అలాగే త‌న‌కంటే చిన్న వయసు హీరోలతో కలిసి నటించాను మ‌రియు పెద్ద వయసు ఉన్న నటులతోనూ పని చేశాన‌ని పేర్కొన్న శ్రుతి.. త‌న‌ దృష్టిలో వయసు సమస్య కాద‌ని, వయసుకు అతీతంగా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాన‌ని వివ‌రించింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.