Begin typing your search above and press return to search.

శ్రుతి బై బై .. దేనికో తెలిస్తే షాక‌వుతారు!

By:  Tupaki Desk   |   2 Oct 2020 1:30 PM GMT
శ్రుతి బై బై .. దేనికో తెలిస్తే షాక‌వుతారు!
X
శ్రుతిహాస‌న్ ఇంత గ్యాప్ తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది అభిమానుల బుర్ర‌ను తొలిచేసే ప్ర‌శ్న‌. మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక డిప్రెష‌న్ వ‌ల్ల‌నే సినిమాల్లో న‌టించ‌లేద‌ని అనుకున్నారంతా. కానీ ఇటీవ‌ల శ్రుతి వేరొక కార‌ణం కూడా చెబుతోంది. అస‌లు సినిమాల‌కు బైబై చెప్పేయాల‌నిపించేంత కోపం ఎందుకంటే త‌న‌ను ఎగ్జ‌యిట్ చేసే ఒక్క ఆఫ‌ర్ కూడా రాలేద‌ట‌. అన్నీ మూస పాత్ర‌లు చెత్త క‌థ‌లు వినిపించే స‌రికి విసుగొచ్చి బైబై చెప్పేసేద‌ట‌.

అందుకే ఈ కోపంతోనే చాలా కాలంగా ఆగి చివ‌రికి ర‌వితేజ‌- గోపిచంద్ ల క్రాక్ మూవీకి ఒప్పుకుంద‌ట‌. ఈ సినిమా క‌థ ఎగ్జ‌యిట్ చేసేది. పైగా రియ‌లిస్టిక్ ఘ‌ట‌న‌ల‌తో రూపొందిస్తున్నది. దీంతో పాటే నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ల‌స్ట్ స్టోరీస్ సిరీస్ లో తాను కూడా భాగం కావ‌డానికి కార‌ణం అక్క‌డ క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డ‌మే. ఇందులో కియ‌రా పోషించిన పాత్ర‌లో శ్రుతి న‌టించ‌నుంది. ఇందులో స్వీయ సంతృప్తి చెందే యువ‌తిగా స్క్రీన్ ని వేడెక్కించేయ‌బోతోంది. ఇక ఈ సిరీస్ ని తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ స‌న్నాహ‌కాల్లో ఉంది.

ప్ర‌భాస్ తో సెట్స్ కెళ్లే ముందే చిన్న పాటి గ్యాప్ లో ల‌స్ట్ స్టోరీస్ సిరీస్ ని పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ వెబ్ ఫిలిం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో షూటింగ్ మొద‌లెట్టారు. 30 నిమిషాల నిడివి ఉండే ఎపిసోడ్ లో శ్రుతి పాత్ర ర‌క్తి క‌ట్టించేలా తీర్చిదిద్దుతున్నాడ‌ట‌. ఇదే కాదు.. త‌న‌ను ఎగ్జ‌యిట్ చేయ‌డంతో రానాతో కలిసి ఓ క్రేజీ వెబ్ సిరీస్ ‌లో శృతి హాసన్ నటించనుందన్న గుస‌గుసా వినిపిస్తోంది.