Begin typing your search above and press return to search.

రాక్ స్టార్ గా ఎంట్రీ ఇవ్వనుందా?

By:  Tupaki Desk   |   7 Nov 2017 1:30 AM GMT
రాక్ స్టార్ గా ఎంట్రీ ఇవ్వనుందా?
X
ఈ రోజుల్లో హీరోలు యాక్షన్ సీన్స్ తోనే కాదు సింగర్స్ గాను మంచి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారు వేసే కొన్ని స్టెప్పులకు వారే గాత్రాన్ని అందించుకుంటున్నారు. అంతే కాకుండా ఇతర హీరోలకు కూడా అప్పుడపుడు తమ వాయిస్ ని దానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్స్ కూడా తక్కువేమీ కాదండోయ్..

కొన్ని సినిమాల్లో వారు కూడా పాటలు పాడి మెప్పించారు. నిత్యా మీనన్ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక శ్రుతి హసన్ కూడా అప్పుడపుడు తన వాయిస్ తో మెలోడీ రాగాన్ని వినిపించే ప్రయత్నం చేస్తుంటోంది. ప్రస్తుతం హీరోయిన్ గా మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నా కూడా మ్యూజిక్ తో అలరించాలని చూస్తోంది. ఈ మధ్యన లండన్ లో ఉంటూ మ్యుజిక్ పైనే ఫోకస్ చేస్తోంది.

ఇన్ని రోజులు హీరోయిన్ గా బిజీగా ఉండడంతో ఇప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ కి టైమ్ దొరికినట్టుంది. ఇక తనలోని అసలు రాక్ స్టార్ ని కూడా బయటపెట్టాలని చూస్తోందట శ్రుతి. త్వరలోనే తన సింగిల్ ఆల్బమ్ రిలీజ్ చేసి.. హీరోయిన్ నుండి ఇప్పుడు రాక్ స్టార్ గా అవతారం ఎత్తనుందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా శృతి కమల్ హాసన్ ఈనాడు సినిమాకి టైటిల్ సాంగ్ ని కంపోజ్ చేసి బెస్ట్ అనిపించుకుంది. ఇక త్రి సినిమాలో కూడా కన్నులదా అనే పాట పాడి మెప్పించింది.