Begin typing your search above and press return to search.

శృతి హాసన్ ఫేసు 'బుక్క'య్యింది

By:  Tupaki Desk   |   5 March 2016 5:30 PM GMT
శృతి హాసన్ ఫేసు బుక్కయ్యింది
X
సెలబ్రిటీల అకౌంట్లంటే హ్యాకర్లకు మహా మోజు. వీళ్ల సోషల్ సైట్లను హ్యాక్ చేసేసి, ఇష్టం వచ్చిన పోస్టులు చేసేస్తూ ఉంటారు. ఇలా హ్యాకింగ్ బారిన పడ్డ వాళ్ల జాబితా చాలానే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి యంగ్ టైగర్ నుంచి ఎన్టీఆర్ వరకూ ఈ బాధలు పడ్డవారే. ఇప్పుడు తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. శృతిహాసన్ మరో సోషల్ సైట్ అయిన ట్విట్టర్ లో చెప్పింది.

'అటెన్షన్.. ఎవరో దుర్మార్గులు నా ఫేస్ బుక్ అకౌంట్ ని హాక్ చేశారు. ప్రస్తుతం దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాం. అప్పటివరకూ ఆ అకౌంట్ ని పట్టించుకోకండి. ధ్యాంక్స్' అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్. సెలబ్రిటీల అకౌంట్లు హ్యాకింగ్ గురి కావడం కొత్తేం కాదు. గతంలో కూడా ఈమె ఫేస్ బుక్ - ట్విట్టర్లతో పాటు జీమెయిల్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. అయితే.. ఇలా హ్యాక్ చేసిన వాళ్లు సాధారణంగా.. హ్యాక్ చేశామనే పోస్ట్ పెడుతూ ఉంటారు. లేకపోతే అడ్డమైన రాతలు, ఫోటోలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు.

కానీ శృతిహాసన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకర్ మాత్రం భలే విచిత్రంగా ఉన్నాడు. మహేష్ బాబుతో 1నేనొక్కడినే సినిమా హీరోయిన్ కృతి సనోన్ కి వీరాభిమాని అనుకుంటా. అందుకే కృతి సనోన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో నుంచి పట్టుకొచ్చి, ఓపిగ్గా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తాం ఈ ఫ్యాన్స్ కి అదో తుత్తి. ఇక ఈ నెల 25న విడుదల కానున్న బాలీవుడ్ మూవీ రాకీ హ్యాండ్సమ్ కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తోంది శృతిహాసన్.