Begin typing your search above and press return to search.
పెళ్లి ప్రశ్నపై శృతి హాసన్ తాజా సమాధానం..!
By: Tupaki Desk | 2 July 2022 5:14 AM GMTకమల్ హాసన్ తనయ శృతి హాసన్ హిందీ.. తెలుగు.. తమిళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ నటిగా మంచి పేరును దక్కించుకుంది. హీరోయిన్ గానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అంటూ నిరూపించుకున్న శృతి హాసన్ స్వాతంత్య్ర భావాలు ఎక్కువగా ఉన్న అమ్మాయి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ.. ఇతరుల గురించి ఆలోచించే ఉద్దేశ్యం లేదు అన్నట్లుగా ఆమె ప్రవర్తన ఉంటుంది.
తాను ఒక స్టార్ కిడ్ ను కనుక ఆయన స్టార్ డమ్ కు తగ్గట్లుగా నడుచుకోవాలి.. ఆయన ఇమేజ్ ను కాపాడుకోవాలి అనే ఉద్దేశ్యంతో శృతి హాసన్ ఎప్పుడు వ్యవహరించలేదు.
మొదటి సినిమా తోనే బికినీలో కనిపించడం వల్ల అప్పుడే కమల్ హాసన్ అభిమానులు ఆమె కు కమల్ కు పొంతన.. పోలిక పెట్టకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఆమద్య శృతి హాసన్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
అతడితో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని.. కమల్ తో కూడా చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ ఆ రిలేషన్ ను బ్రేకప్ చేసుకుని ప్రస్తుతం శాంతను హజారే తో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. శృతి హాసన్ యొక్క రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. ఆయన తో శృతి చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు ఎన్నో బయటకు వచ్చాయి.
ప్రేమ వ్యవహారం గురించి బాహాటంగానే క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్ ఎప్పుడు కూడా పెళ్లి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ కు శృతి హాసన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ను పెళ్లి గురించి సదరు మీడియా వారు ప్రశ్నించారు. గతంలో వచ్చిన సమాధానం శృతి నుండి వచ్చింది.
కొత్తగా పెళ్లి గురించి ఆమె సమాధానం ఏమీ మారలేదు. ఆమె తాజా సమాధానం కూడా పెళ్లి గురించి అదే ఉంది. ఆమె స్పందిస్తూ.. నా పెళ్లి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి నా వద్ద లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి సినీ జీవితాన్ని మరియు లివ్ ఇన్ రిలేషన్ ను ఆమె ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆమె వ్యాఖ్యలతో మరియు సోషల్ మీడియా పోస్ట్ ల తో అర్థం అవుతుంది. ముందు ముందు అయినా శృతి హాసన్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అంటే చెప్పలేం అనే సమాధానం వస్తుంది.