Begin typing your search above and press return to search.
మీటూ : భయపడను - కోర్టులోనే తేల్చుకుంటా!
By: Tupaki Desk | 25 Oct 2018 9:46 AM GMTబాలీవుడ్ లో ప్రారంభం అయిన మీటూ మూమెంట్ ఇప్పుడు సౌత్ లో సెగలు రేపుతోంది. ముఖ్యంగా కన్నడ సినిమా పరిశ్రమలో ఈ వివాదం తారా స్థాయిలో ఉంది. కన్నడ స్టార్ హీరో అర్జున్ పై హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద దుమారం రేగుతోంది. మరేదో ఉద్దేశ్యంతో - వెనుక ఎవరో ఉండి శృతితో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కొందరు మాత్రం శృతికి మద్దతుగా నిలుస్తున్నారు.
శృతికి మద్దతు తెలిపేవారి సంఖ్య కంటే అర్జున్ కు బాసటగా నిలుస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా శృతి హరిహరన్ ఏమాత్రం నిరాశ చెందకుండా తన పని తాను చూసుకుంటూ పోతుంది. తాను చేసిన లైంగిక ఆరోపణలకు కట్టుబడి ఉంటాను అని, అర్జున్ తనపై లైంగిక ఆరోపణలు చేశాడంటూ జనాలకు నేను సాక్ష్యాధారాలను చూపించాల్సిన అవసరం నాకు లేదు అంటూ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతోంది.
తాను చేసిన లైంగిక ఆరోపణలపై ఆయన కోర్టుకు వెళ్తే అప్పుడు నేను ఆయనకు సమాధానం చెబుతాను, కోర్టులో ఆయన నాపై లైంగిక ఆరోపణలు చేసినట్లుగా తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను బయట పెడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అర్జున్ పై తాను ఆరోపణలు చేసినప్పటి నుండి నాకు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి, అయినా కూడా నేను భయపడకుండా వాటి ఎదుర్కొంటున్నాను అంది. నాకు బాసటగా నిలుస్తున్న వారిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. వారంతా కూడా ఏదో ఒక రోజు నిజాలు తెలుసుకుంటారని శృతి హరిహరన్ పేర్కొంది.