Begin typing your search above and press return to search.
అప్పుడలా వదులుకోవడమే కలిసొచ్చిందా శ్రుతీ?
By: Tupaki Desk | 25 July 2021 8:30 AM GMTకమల్ హాసన్ గారాలపట్టి శ్రుతిహాసన్ కంబ్యాక్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. క్రాక్- వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్లు టాలీవుడ్ కెరీర్ కి హుషారు నింపాయి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన `సలార్` లో నటిస్తోంది. మరి ఈ సినిమాలో ఛాన్సెలా వచ్చింది? శ్రుతి హాసన్ నే ఎంపిక చేయడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే..
అప్పుడు మిస్సయినది ఇప్పుడు దక్కించుకుంది! అంటూ గుసగుస వేడెక్కిస్తోంది. టాలీవుడ్ లో ఓ భారీ డిజాస్టార్ నుంచి తప్పించుకుని ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. నిజానికి కెరీర్ ఆరంభం శ్రుతి చాలా సినిమాలను స్కిప్ కొట్టింది. అలా స్కిప్ కొట్టిన సినిమాల వివరాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అప్పట్లో రాఘవలారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా `రెబల్` అత్యంత భారీ కాన్సాస్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవి చూసింది. ఇందులో శ్రుతి బదులుగా తన స్నేహితురాలు మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. మిల్కీ బ్యూటీ పాత్రకు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. డాన్ అసిస్టెంట్ కుమార్తెగా రెబల్ ని హైలైట్ చేసే స్ఫూర్తివంతమైన ప్రేమికురాలిగా తమన్నా నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఛాన్స్ ముందుగా శ్రుతి హాసన్ ని వరించింది. రాఘవ లారెన్స్ తనను ఒప్పించడానికి ఎంతగానో కన్విన్స్ చేసినా సున్నితంగా తిరస్కరించిందిట. అందుకు కారణంగా ఆమె బిజీ షెడ్యూల్స్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రుతి అప్పటికే బిజీ నాయిక. పలు తెలుగు తమిళ్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శ్రుతి హాసన్ కి కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడంతో అంగీకరించలేదని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే అప్పుడు అలా కుదరకపోవడమే ఇప్పుడు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతోన్న సమయం. కానీ ఇప్పుడు ఆయన స్థాయి వేరు. బాహుబలి తర్వాత దేశం గర్వించదగ్గ అసాధారణ నటుడిగా ఎదిగారు. బాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అంతటి స్టార్ సరసన శ్రుతిహాసన్ `సలార్` లో నటించడం మరింతగా కలిసొచ్చే అంశం. శ్రుతి హిందీ ఆడియెన్ కి సుపరిచితం కాబట్టి సలార్ కి అది ప్లస్ కానుంది.
భాగ్యలక్ష్మి యాక్షన్ క్వీన్ గా..!
`సలార్` లో శ్రుతి యాక్షన్ క్వీన్ గా కనిపిస్తుందా.. అంటే అవుననే సమాచారం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ ని ఎంపిక చేయడానికి కారణం తన పాత్ర కూడా ఛాలెంజింగ్ గా ఉంటుందట. శ్రుతి ఇందులో స్టంట్స్ చేస్తుందని ఇంతకుముందు లీకులందాయి. ఇక ఇదే మూవీలో మరో కీలక పాత్రకు వాణీ కపూర్ ని తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇండియాలోనే ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా హైదరాబాద్- బెంగుళూరు- మైసూరు లోనే మేజర్ షెడ్యూల్స్ చిత్రీకరణ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా కొన్ని సన్నివేశాలు కోసం ఏకంగా 1970 కాలానికే యూనిట్ వెళ్లబోతుంది. నాటి కాలాన్ని తలపించేలా అద్భుతమైన సెట్ ని మైసూర్ లో నిర్మిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆర్ట్ వర్క్ టీమ్ ని దించారని కథనాలొచ్చాయి. అక్కడ కీలక మైన సన్నివేశాల్ని...యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించడానికి ఆ సెట్ ని వినియోగిస్తున్నారు. అలాగే 1970 కాలానికి చెందిన వాహనాల్ని డిజైన్ చేయడం ఇంట్రెస్టింగ్. యాక్షన్ సన్నివేశాల్లో వీటిని హైలైట్ చేయనున్నారు.
సలార్ రిలీజ్ ఎపుడు? అంటే..
2022 సమ్మర్ నాటికి సలార్ ని రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. దానికి తగ్గట్టు షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా షెడ్యల్స్ ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ జరుపుకున్న `సలార్` తదుపరి షెడ్యూల్ ఆగస్టులో ప్రారంభం అవుతుంది.