Begin typing your search above and press return to search.

నా ఒంటిపై ఎవరికి కనిపించని చోట ఓ టాటూ ఉంది: శృతిహాసన్

By:  Tupaki Desk   |   26 July 2020 1:30 AM GMT
నా ఒంటిపై ఎవరికి కనిపించని చోట ఓ టాటూ ఉంది: శృతిహాసన్
X
దేశంలో కరోనా భయంతో ప్రస్తుతం ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు గతంలో దిగిన ఫోటోలను, గతంలో తమకు ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా గబ్బర్ సింగ్ బ్యూటీ శృతిహాసన్ కూడా గతంలో తాను వేయించుకున్న టాటూల గురించి బయట పెట్టింది. అలాగే టాటూలకు సంబంధించిన విషయాలన్ని పంచుకుంది. ప్రస్తుతం నయా ట్రెండులో టాటూ అనేది సర్వసాధారణం అయిపోయింది. అటు సెలబ్రిటీల నుండి ఇటు యూత్ వరకు అంతా టాటూ మోజులో పడిపోతున్నారు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయని అలా వేయించుకుంటారు. కొందరేమో ప్రేమికుల కోసం టాటూ వేయించుకుంటే.. మరికొందరు ఊరికే టైంపాస్ కి వేయించుకుంటారు. కానీ మనం ఎవరివి పట్టించుకోము. ఎందుకంటే మన ఫేవరెట్ హీరోలు, హీరోయిన్ల టాటూల గురించి మాత్రమే ఇంటరెస్ట్ చూపిస్తాం.

సినీతారల అభిమానులు అందరికి వాళ్ల ఫేవరెట్ హీరోయిన్ టాటూ ఎందుకు వేయించుకుంది..? తన లవర్ కోసమేనా అనే డౌట్స్ మాములుగా వస్తుంటాయి. అయితే ఎప్పటినుండో అందాల భామ శృతిహాసన్ తప్పించుకుంటూ పోతుంది. తాజాగా శృతి.. తన ఒంటి పై టాటూలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. వాటి వెనక స్టోరీ ఏంటనేది బయట పెట్టింది. మొత్తానికి అమ్మడి ఒంటి పై ఐదు పచ్చబొట్లు ఉన్నాయట. మొదటిది మణికట్టు పై లండన్ లో వేయించుకున్న గులాబి టాటూ.. రెండోది వెనక వీపు భాగంలో ఉందట. ఇక మూడోది నా చెవి వెనక మ్యూజికల్ టాటూ.. నాలుగోది పాదం పై ఉండగా.. ఇక ఐదవ పచ్చబొట్టు చాలా సీక్రెట్ అంటోంది. అదెక్కడ ఉందంటే.. వీపు కింది భాగంలో ఎవరికీ కనిపించని చోటులో ఉందని కుర్రకారుకి మతిపోగొడుతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోయినా అమ్మడు ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన రెండోసారి జతకట్టి 'క్రాక్' మూవీ చేస్తోంది.