Begin typing your search above and press return to search.

పక్కన నాన్న ఉన్నా.. పరువాల ప్రదర్శనే

By:  Tupaki Desk   |   10 Jun 2016 10:18 PM IST
పక్కన నాన్న ఉన్నా.. పరువాల ప్రదర్శనే
X
శృతి హాసన్ ను ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు అని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చాలా విషయాల్లో ఇప్పటికే తండ్రికి తగ్గ తనయ అనిపించేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ చెలరేగిపోతూ దూసుకుపోతోంది. మహానటుడి కూతుర్ని కదా.. ముడుచుకుని కూచుంటా.. మొత్తం కప్పేసుకునే నటిస్తా.. ఇలాంటి కబుర్లేం చెప్పదు శృతి. ఆడియన్స్ కి ఏం కావాలో.. ఏం ఇవ్వాలో పక్కాగా అందించేయడం అమ్మడి స్పెషాలిటీ.

ఇప్పటికే చాలాసార్లు తన ఎక్స్ పోజింగ్ లెవెల్స్ ని సెక్స్ పోజింగ్ స్థాయికి చేర్చేసిన ఘనత కూడా శృతి హాసన్ కి ఉంది. అయితే.. 'శభాష్ నాయుడు' అనే సినిమాలో తొలిసారిగా తండ్రితో కలిసి నటిస్తోంది శృతి. ఇందులో కమల్ కి కూతురుగానే నటిస్తుండడం విశేషం. మరి నాన్న సినిమాలో నటిస్తోంది కాబట్టి.. అమ్మడి అందాల ఆరబోత జోరుకు బ్రేక్ పడుతుందేమో అని భయపడ్డ అభిమానులకు.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

శభాష్ నాయుడుకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూసి అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. పక్కన నాన్న ఉన్నా సరే.. అమ్మడు చేస్తున్న ఎక్స్ పోజింగ్ స్థాయిని చూసి నోరెళ్లబెట్టేస్తున్నారు. తన కేరక్టర్ తనకు ఇంపార్టెంట్ కానీ.. పక్కన నాన్న ఉన్నా ఏం పర్లేదన్నట్లుగా ఉంది శృతి హాసన్ వ్యవహారం. అంతే కాదు.. ఈమె హై లెవెల్లో క్లీవేజ్ ను చూపిస్తూ.. కమల్ తో కలిసి ఫోజులిస్తోందంటే.. అమ్మడి డేరింగ్ ని అర్ధం చేసుకోవచ్చు.