Begin typing your search above and press return to search.
శృతి కళ్లు తెరిపించిన కాటమరాయుడు
By: Tupaki Desk | 11 April 2017 4:23 AM GMTపవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీ ఇప్పటికే 60+ కోట్ల షేర్ ను సాధించింది. అయినా సరే ఈ చిత్రాన్ని ఫ్లాప్ కేటగిరీలోకే చేర్చాలి. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టడం ఈ చిత్రానికి అసాధ్యం అనే విషయం తేలిపోయినట్లే. మహా అయితే.. మరో వారం పది రోజులు థియేటర్లలో ఉండొచ్చు కానీ.. 20-25 కోట్లు రాబట్టేసి సేఫ్ జోన్ లోకి వచ్చేయడం కుదరని పనే.
కాటమరాయుడు ఫ్లాప్ సంగతేమో కానీ.. దానికి కారణాలుగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్.. శృతి హాసన్ అప్పియరెన్స్ లనే చూపారంతా. గ్లామర్ క్వీన్ అనిపించుకున్న శృతి.. కెమేరా ముందు దారుణంగా కనిపించింది. ఫేస్ నుంచి షేప్ ల వరకూ చూసేందుకే బాగోలేదని అనుకుంటే.. కాస్ట్యూమ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. తనపై వచ్చిన ఇన్నేసి విమర్శలకు శృతి షాక్ తినేసింది. వెంటనే అలర్ట్ కాకపోతే తన కెరీర్ కే ప్రమాదం వచ్చేస్తుందనే విషయాన్ని గుర్తించిన శృతి.. వర్కవుట్స్ మొదలుపెట్టి.. మళ్లీ నాజూగ్గా మారే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మరోవైపు స్టైలిస్ట్ ను కూడా మార్చేస్తోందట ఈ చెన్నై భామ. గుడ్డిగా నమ్మి కాటమరాయుడు పాటల షూటింగ్ స్పాట్ కి వెళితే.. వాళ్ల నిర్వాకం ఎలా ఉందో తెలిసింది. అందుకే కొత్త స్టైలిస్ట్.. కాస్ట్యూమ్ డిజైనర్లను వెతుక్కునే పనిలో పడింది శృతి హాసన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/