Begin typing your search above and press return to search.

అవును స‌ర్జ‌రీ నిజ‌మే.. అయితే ఏంటి?

By:  Tupaki Desk   |   28 Feb 2020 6:15 AM GMT
అవును స‌ర్జ‌రీ నిజ‌మే.. అయితే ఏంటి?
X
ముఖాకృతిని మార్పించుకునేందుకు క‌థానాయిక‌లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీని ఆశ్ర‌యించ‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే. ముక్కు వంక‌ర‌.. చిక్ షేపింగ్ అంటూ చాలానే మార్పులు చేస్తుంటారు. హిస్ట‌రీలో డ‌జ‌న్ల కొద్దీ నాయిక‌ల పేర్లు ఈ కేట‌గిరీలో వినిపించాయి. ఇక అతిలోక సుంద‌రి శ్రీదేవి .. గౌత‌మి వంటి తార‌ల స‌ర్జ‌రీల‌పైనా ర‌క‌ర‌కాల చ‌ర్చ సాగింది.

ఇటీవ‌లి కాలంలో అందాల శ్రుతిహాస‌న్ ముక్కు స‌ర్జ‌రీపైనా అంతే ఇదిగా నెటిజ‌నులు ట్రోల్ చేశారు. ఈ అమ్మ‌డు ఉన్న‌ట్టుండి బ‌రువు పెర‌గ‌డంపైనా .. ఆకృతిని మార్చుకోవ‌డంపైనా నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియా లో ట్రోల్ చేశారు. అయితే ట్రోల‌ర్స్ వద్ద శ్రుతి ఏదీ దాచాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే త‌న‌కు తానుగానే స‌ర్జ‌రీపై ఓపెన్ అయ్యింది.

``ఇది నా జీవితం.. ఇది నా ముఖం!! అని చెప్పడం నాకు సంతోషమే. అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఇది అంగీకరించడానికి సిగ్గుపడను. నేను దానిని ప్రోత్సహిస్తున్నానా? లేదూ వ్యతిరేకిస్తున్నానా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి. ఇలా ఉండ‌డానికే నేను ఇష్ట‌ ప‌డ‌తాను`` అని తెలిపింది. నేను స‌న్న‌గా ఉన్నాన‌ని.. లేదు లావు అయ్యాన‌ని ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తుంటారు. ఇత‌రుల అభిప్రాయాల్ని ప‌ట్టించుకోను అని కాస్త క‌టువుగానే చెప్పేసింది. శారీర‌క మార్పు అనేది వ్య‌క్తిగ‌తం. దానిపై కామెంట్ చేసే హ‌క్కు ఎవ‌రికీ లేదు అన్న‌ది త‌న అభిప్రాయం కావొచ్చు. అన్న‌ట్టు ముక్కును కాస్త సూదిగా ట్రిమ్ చేయించిందేమిటో!