Begin typing your search above and press return to search.
కొంపతీసి కలసి కాఫీ తాగుతున్నారా?
By: Tupaki Desk | 5 Oct 2015 7:30 AM GMTఒక అందమైన అమ్మాయి .. కొత్త అపార్ట్మెంట్ లో అప్పుడే అడుగుపెడుతోంది. రూమ్ దగ్గరకు వెళ్లగానే .. ఆ పక్క అపార్ట్మెంట్ కుర్రాడు .. అసలే అందగాడు.. ఇట్టే ఆకర్షించేశాడు.. అంతే ఇంకేం ఉంది. ఇంకా తన కొత్త అపార్ట్ మెంట్ లో అడుగుపెట్టకుండానే తనని తాను పరిచయం చేసేసుకుంది. సుకన్య .. అంటూ ఇంట్రడక్షన్ ఇవ్వగానే.. అయాన్ అంటూ అల్లుకుపోయాడు ఆ కుర్రాడు. లెట్స్ సీ మై హౌస్ అంటూ ఇంట్లోకి ఆ అందమైన లేడీని ఆహ్వానించాడు. ఇంకేం ఉంది.. ఇంకేం గమ్మత్తు జరగబోతోందో? అనిపిస్తుంది. అందుకు తగ్గట్టే అమ్మాయిని లోనికి ఆహ్వానించి మత్తెక్కించే విషయాల్నే చూపించాడు ఆ కుర్రాడు.
మై లివింగ్ రూమ్ .. డైనింగ్ రూమ్ అంటూ పరిచయం చేశాడు.. మై పార్టీ రూమ్ అంటూ అంతలోనే పార్టీ మూడ్ లోకి వచ్చేశాడు. అమ్మాయికి ఆ పక్కింటి కుర్రాడు అపార్ట్ మెంట్ పిచ్చిగా నచ్చేసింది. ఇదే సరైన టైమ్ అనుకున్న ఆ కుర్రాడు వెంటనే కాఫీ అంటూ ప్రపోజల్ పెట్టేశాడు.. గోడకు కొట్టిన బంతిలా అంతే ఫాస్ట్ రెస్పాన్స్. ఏ రూమ్ లో?? ఊహించని ఝలక్ కి ఆ కుర్రాడు స్టన్ అయిపోయాడు... ఇదంతా ఓ యాడ్. ఇప్పుడు హాట్ గా అందరూ చర్చించుకుంటున్న యాడ్.
ప్రఖ్యాత ఫిలిప్స్ కంపెనీ లైటింగ్ స్కీమ్ కి సంబంధించిన యాడ్ ఇది. ఇంట్లో ఫిలిప్స్ బల్బుల్ని పెట్టుకోండి. మీక్కావాల్సిన రంగుల్లో తేజోమయం చేసుకోండి అంటూ చెప్పడానికి ఓ అందమైన అమ్మాయి (శ్రుతిహాసన్), అందమైన అబ్బాయి (రణబీర్ కపూర్) .. ఇద్దరి మధ్యా రోమాంచితమైన పరిచయాన్ని యాడ్ లో చూపించారు. అదీ సంగతి. అసలింతకీ ఆ ఇద్దరు రియల్ లైఫ్ లోనూ కాఫీ కలిసే తాగుతున్నారా? అన్నది అసలైన డిష్కసన్ పాయింట్. అలా చేస్తే రణబీర్ ని కత్రిన చంపేయదూ? శృతిహాసన్ పై కారాలూ మిరియాలూ నూరేయదూ?