Begin typing your search above and press return to search.
వ్వాట్! 'సలార్' తో శ్రుతిహాసన్ కి ఇక్కట్లు!?
By: Tupaki Desk | 9 Dec 2021 5:08 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ రానంత భారీ యాక్షన్ థ్రిలర్ ఇది. కేజీఎఫ్ ని మించి యాక్షన్ సన్నివేశాలు పరాకాష్ట లో ఉంటాయని అంచనాలున్నాయి. 150 కోట్ల బడ్జెట్ తో కేజీఎఫ్ రేంజును తలదన్నేలా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే విషయంలో యూనిట్ ఎక్కడా తగ్గడం లేదు. తొలి సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తుంది. ఇందులో ప్రభాస్ పక్కా మాస్ లుక్ లో ఆకట్టుకోబోతున్నారు.
సలార్ లో ప్రభాస్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. కంటెట్ కి తగ్గ కటౌట్ దొరకడంతో ప్రశాంత్ నీల్ మరింత కాన్ఫిడెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ సహా కీలక నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో హీరోయిన్ గా అందాల శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో శ్రుతి పాత్ర కూడా బలంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఆమె పాత్ర కు సంబంధించిన చిన్న హింట్ దొరికింది. సినిమాలో నటించడం శ్రుతి హాసన్ కి కష్టతరంగా మారిందిట. ఎక్కడా విశ్రాంతి లేకుండా డేట్లు కేటాయించిన నాటి నుంచి తరుచూ షూట్ కి హాజరవ్వాల్సి వస్తోందిట.
సెట్స్ కి వెళ్లడం ఒక ఎత్తు అనుకుంటే.. వెళ్లిన తర్వాత రగ్గ్ డ్ గా రఫ్ అండ్ ఠఫ్ గా ఉండే సన్నివేశాల్లో నటించడం ఇబ్బందికరంగా మారుతోందిట. వీటన్నింటికి మించి బహుభాష చిత్రం కావడంతో కన్నడ..తెలుగు లో ఒకేసారి నటించడం మరింత కష్టంగా ఉందని చెబుతోంది. శ్రుతి పెయిన్ లో నిజం ఉంది. ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేస్తే నటించడం ఎలాంటి వారికైనా కష్టంగానే ఉంటుంది. రెస్ట్ లెస్ గా పనిచేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అదనంగా డేట్లు కేటాయించాలి. అందుకు నిర్మాత ఒప్పుకోడు. ఉన్న సమయంలోనే దర్శకుడు తనపై షూట్ పూర్తి చేయాలి. ఆమె కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూటింగ్ ని పూర్తిచేసి బయటకు రావాలి. ఆ క్రమంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి. సలార్ ని తెలుగు-కన్నడం- హిందీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని ఎంతో తెలివిగా మేకింగ్ ని ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. టార్గెటెడ్ ఆడియెన్ తో పాటు ఇతర భాషల్లోనూ అనువదించి భారీగా రిలీజ్ చేస్తారు. సలార్ కి బిజినెస్ పరంగానూ హైప్ స్కైలో ఉంది.
శంతనుతో రొమాంటిక్ లైఫ్ ఇదీ సంగతి!
సెకండ్ ఇన్నింగ్స్ లో క్రాక్ సినిమాతో కంబ్యాక్ అయ్యింది మొదలు శ్రుతి స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ హీరోయిన్ గా పాన్ ఇండియా చిత్రం `సలార్` లో నటిస్తుండడంతో ఈ సినిమా మినహా కొత్త కమింట్ మెంట్లు ఏవీ లేవు. `సలార్` షూటింగ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. షూటింగ్ ఉన్నంత వరకూ ఆన్ ది స్పాట్ అన్నివిధాలా సహకరిస్తోంది. ఆ తర్వాత చెన్నై కి వెళ్లిపోతోందట. ఇక మిగిలిన ఖాళీ సమయంలో మాత్రం ప్రియుడు శంతను హజారికతోనే గడుపుతోంది. ఈ జంట రొమాంటిక్ లైఫ్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పండుగల్ని శ్రుతి తన ప్రియుడితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. త్వరలో క్రిస్మస్ వేడుక కోసం ప్రియుడితో స్పెషల్ ప్లాన్స్ చేస్తోందట. ఇంతకీ సలార్ కి అందుబాటులో లేకుండా వెళుతుందా? ఏదైనా విదేశీ విహార యాత్రను ప్లాన్ చేసిందా? అన్నది వేచి చూడాలి. అలాగే డిసెంబర్ 31 మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కి ప్లానింగ్ ఏమిటన్నది శ్రుతి చెబుతుందేమో చూడాలి.