Begin typing your search above and press return to search.
పురుషాధిక్యతపై 'సలార్' బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 11 Aug 2022 3:45 AM GMTసినీ పరిశ్రమలో పురుషాధిక్యతపై తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్త్రీలు పురుషుల మధ్య సమానత్వం ఉండదని.. మేల్ స్టార్స్ తో సమానంగా పారితోషికం ఇవ్వరని గతంలో పలువురు హీరోయిన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళల పట్ల వివక్ష చూపుతుంటారని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
సమాజం మొత్తం అలానే ఉన్నందున సినిమా పరిశ్రమలో మాత్రమే పురుషాధిక్యత ఉంటుందనే విధంగా చూపడం సరికాదని శృతి హాసన్ అన్నారు. సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాటికి ప్రతిబింబం మాత్రమేనని.. సమాజం మొత్తం మగవారి ఆధిపత్యంలో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని మాత్రమే నిందించడంలో అర్థం లేదని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఇటీవల హీరోయిన్ తాప్సీ పన్ను సైతం సినీ పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష ఉందని.. తన కెరీర్ ప్రారంభం నుంచీ చూస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేసింది. లొకేషన్స్ దగ్గర నుంచి అకామిడేషన్ - రెమ్యూనరేషన్ వరకూ అందరూ మేల్ - ఫీమేల్ అనే తేడాలు చూపిస్తున్నారని పేర్కొంది.
మేల్ స్టార్స్ ను ఒక విధంగా ఫీమేల్ స్టార్స్ ను మరోలా ట్రీట్ చేస్తారని చెప్పింది తాప్సి. స్టార్ డమ్ వచ్చిన తరువాత పరిస్థితుల్లో మార్పులు వచ్చేవని.. కానీ ఎంత మార్పు వచ్చినా హీరోల కంటే తక్కువగానే చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోలతో పోల్చితే తమ పారితోషికాల్లో చాలా తేడా ఉంటుందని చెప్పింది.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఇచ్చే కార్వాన్లు అగ్గి పెట్టెల్లా ఉండేవని.. అదే హీరోలకు డబుల్ డోర్ వెహికిల్స్ ఏర్పాటు చేసేవారని తాప్సీ తెలిపింది. మేకప్ - కాస్ట్యూమ్ - హెయిర్ స్టైలిస్ట్.. ఇలా హెల్పర్స్ విషయంలోనూ చిన్న చూపు ఉంటుందని చెప్పింది. ఇప్పుడు శృతి హాసన్ సైతం చిత్ర పరిశ్రమలోనే కాదు.. అంతటా పురుషాధిక్యత ఉంటుందని పేర్కొంది.
నెపోటిజం గురించి శృతి హాసన్ మాట్లాడుతూ.. సాధారణంగా స్టార్ కిడ్స్ కు ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని భావిస్తుంటారు. కానీ వారి తల్లిదండ్రులు కేవలం ఇండస్ట్రీ ఎంట్రీ కోసం మాత్రమే ఉపయోగపడతారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సొంత టాలెంట్ ఉండాలని అభిప్రాయ పడింది. తన కోసం తల్లిదండ్రులు ఎవరికి ఫోన్లు చేసి రికమెండ్ చేయలేదని.. తన కష్టంతోనే రాణిస్తున్నానని శృతి తెలిపింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. శృతి హాసన్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సలార్' అనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలానే NBK107 సినిమాలో నందమూరి బాలకృష్ణ కు జోడీగా చేస్తోంది. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కనిపించనుంది శృతి.