Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ ఇతడేనా??

By:  Tupaki Desk   |   16 Feb 2017 1:00 PM GMT
బాయ్ ఫ్రెండ్ ఇతడేనా??
X
శృతి హాసన్ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ఏదో ఒక సస్పెన్స్ తో నిండి ఉంటుంది. సినిమాల విషయంలో ఎంపికలోనే అమ్మడి ట్యాలెంట్ బైట పడిపోతుంది. చివరగా ఈ భామ తెలుగులో కనిపించిన సినిమాలు మూడు. మహేష్ తో శ్రీమంతుడు.. నాగ చైతన్యతో ప్రేమమ్.. రీసెంట్ గా సూర్యతో కలిసి ఎస్3 అంటూ పలకరించింది కమల్ డాటర్.

ఇప్పుడు కాటమరాయుడు మూవీతో వచ్చే నెలలో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానున్న శృతి.. పవన్ కళ్యాణ్ తో కసరసన రెండోసారి నటిస్తున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతం ఈమె ఓ ఇటాలియన్ కుర్రాడితో డేటింగ్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ లండన్ బేస్డ్ యాక్టర్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కెమేరా కళ్లకు చిక్కింది శృతి హాసన్. ఇతని పేరు మైకేల్ కోర్సల్. ఓ మూడు నెలలుగా ఇతడితో శృతి హాసన్ బాగా క్లోజ్ గా మూవ్ అవుతోందనే టాక్ ఎక్కువగానే ఉంది.

తాజాగా శృతి హాసన్ పెట్టిన ఓ పోస్ట్ ను.. ఆమె ప్రేమకు.. రూమర్స్ కు లింక్ చేసి చూస్తున్నారు చాలామంది. 'ఒంటరిగా అయినా.. జంటగా అయినా.. ప్రతీ అడుగూ లెక్కే. మీ సొంత లోకం లోకి పయనించండి' అంటూ శృతి చేసిన ఆమె లవ్ స్టోరీకి సింబల్ అనేస్తున్నారు. ఇప్పటికే చాలామందితోనే శృతికి అఫైర్ అంటూ న్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ మైకేల్ కోర్సల్ స్టోరీని శృతి హాసన్ ఏ టైపులో డీల్ చేస్తుందో అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/