Begin typing your search above and press return to search.

చిరంజీవి స‌ర‌స‌న‌ ప్రభాస్ హీరోయిన్?

By:  Tupaki Desk   |   30 Oct 2021 5:34 AM GMT
చిరంజీవి స‌ర‌స‌న‌ ప్రభాస్ హీరోయిన్?
X
వెట‌ర‌న్ స్టార్ల స‌ర‌స‌న న‌టించేందుకు కొంద‌రు భామ‌లు అంగీక‌రించ‌ని సంగ‌తి తెలిసిందే. త‌మ‌కంటే రెండు మూడు రెట్ల‌ వ‌య‌సు ఉన్న అగ్ర హీరోల‌కు సంత‌కం చేయ‌డానికి స‌సేమిరా అనేస్తున్నారు. ఆ స‌మ‌స్య టాలీవుడ్ లో ప‌లువురు అగ్ర హీరోల‌కు ఎదుర‌వుతూనే ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించేందుకు ప్ర‌ముఖ క‌థానాయిక‌ల‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని ఇటీవ‌ల ప్రూవైంది.

ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ కోర‌గానే అందాల చంద‌మామ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించింది. అయితే అప్ప‌ట్లో క‌థానాయిక కోసం చాలా వేచి చూడాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత సైరా న‌ర‌సింహారెడ్డి కోసం న‌య‌న‌తార -త‌మ‌న్నాల‌ను లాక్ చేయ‌డంలో చిత్ర‌బృందం స‌ఫ‌ల‌మైంది. ఇప్పుడు చిరు న‌టిస్తున్న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌థానాయిక‌ల్ని వెతుకుతున్నారు. గాడ్ ఫాద‌ర్ లో చిరుకి నాయిక ఉండ‌దు. త‌దుప‌రి బాబి.. మెహ‌ర్ చిత్రాల‌కు క‌థానాయిక‌లు అవ‌స‌రం.

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం నవంబర్ లో గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అల్ట్రా మాస్ అవతార్ లో క‌నిపించ‌నున్నారు.

ఈ చిత్రంలో కథానాయిక గురించి ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరు కథానాయికగా నటించేందుకు అందాల సుందరి శ్రుతిహాసన్ తో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. శ్రుతి తదుపరి భారీ బడ్జెట్ పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా సాలార్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తున్న సంగ‌తి విధిత‌మే. శ్రుతి ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అన్న‌య్య‌తోనూ ఆఫ‌ర్ అందుకుంటోంది. చిరు154 కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. బాబి చిత్రానికి వాల్టేర్ శీను అనే టైటిల్ ని ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. మ‌రోవైపు చిరు భోళా శంక‌ర్ న‌వంబ‌ర్ 11న లాంచ్ కానుంది. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.