Begin typing your search above and press return to search.
హీరోయిన్ ని ఆటలో అరటిపండుని చేసేశారా?
By: Tupaki Desk | 15 Jan 2023 1:30 AM GMTఆటలో అరటి పండుకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికి తెలిసిందే. వున్నట్టే వుంటుంది.. కానీ వుండదు.. కనిపించినట్టుగానే వుంటుంది కానీ దాని ప్రాధాన్యత మాత్రం వుండదు. సేమ్ ఇదే తరహా క్యారెక్టర్లలో క్రేజీ హీరోయిన్ ని చూపించారు. వివరాల్లోకి వెళితే.. ఈ సంక్రాంతికి ఇద్దరు అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటా పోటీగా పోటీపడ్డారు. నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ డ్రామా 'వీర సింహారెడ్డి'తో జనవరి 12న బరిలోకి దిగాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'తో సై అంటూ జనవరి 13న రంగంలోకి దిగాడు. ఈ రెండు సినిమాలని మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. రిలీజ్ కు ముందు థియేటర్ల విషయంలో భారీ రచ్చే జరిగింది. అయితే చివరి నిమిషంలో దిల్ రాజు తాను నిర్మించిన 'వారసుడు' మూవీ రిలీజ్ ని 14కు వాయిదా వేయడంతో అంతా సద్దుమనిగింది... ఆ తరువాత సంక్రాంతి బరిలో గట్టి పోటీనిస్తాయని భావించిన తమిళ డబ్బింగ్ సినిమాలు 'తెగింపు, 'వారసుడు' చిత్రాల ఫలితాలు తేలిపోవడంతో దీంతో సంక్రాంతి వార్ చిరు, బాలయ్య మధ్యే ఫిక్స్ అయింది.
బాలకృష్ణ 'వీర సింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వున్నట్టుండి శృతిహాసణ్ కు ఈ ఇద్దరు అగ్రహారోలతో కలిసి నటించే అవకాశం రావడంతో తన రేంజ్ మారిపోతుందని, తనకు ఈ రెండు సినిమాల్లోనూ అధిక ప్రాధాన్యత నిచ్చారంటూ ప్రచారం జరిగింది. అంతా అదే నిజమనుకున్నారు. తీరా థియేటర్లోకి వెళితే.. శృతికి పెద్ధగా రెండు సినిమాల్లోనూ ఎలాంటి ప్రాధాన్యత కనిపించలేదు.
'క్రాక్' సినిమాలో శృతిపై ప్రత్యేక ఫీట్లు, ఓ రేంజ్ ఫైట్ ని డిజైన్ చేసిన గోపీచంద్ మలినేని 'వీర సింహారెడ్డి'లో మాత్రం తనని లైట్ తీసుకున్నాడని పంచ్ లు పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొంత.. సెకండ్ హాఫ్ లో ఓ పాట కోసం మాత్రమే శృతిహాసన్ ని ఈ మూవీ కోసం గోపీచంద్ తీసుకున్నట్టుగా అనిపించిందని నెటిజన్ లు వాపోతున్నారు. ఇక చిరు 'వాల్తేరు వీరయ్య'లోనూ శృతిది ఇదే పరిస్థితి. ఇందులో పేరుకే శృతి హారోయిన్.. అంతే కాకుండా రా ఏజెంట్ గా కనిపించింది.
రానీ ఏం లాభం.. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యతే లేదు. ఏదో వుంది అంటే వుంది అన్నట్టుగా మాత్రమే శృతి పాత్ర వుందని ఫ్యాన్స్ వాపోతున్నారట. పేరుకే పెద్ద సినిమాల్లో నటించిందే కానీ పేరు, పాత్రల ప్రాముఖ్యత అసలు లేకపోవడంతో శృతి ఆశలన్నీ ఇక 'సలార్'పైనే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మరి ప్రశాంత్ నీల్ అయినా శృతికి 'సలార్'లో సరైన ప్రాధాన్య ఇచ్చాడో తేదో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.