Begin typing your search above and press return to search.

'మై డే ఇన్‌ ది సన్‌' అంటున్న శృతి

By:  Tupaki Desk   |   3 March 2016 4:34 PM GMT
మై డే ఇన్‌ ది సన్‌ అంటున్న శృతి
X
సెక్సిణి శృతి హాసన్‌. ఇప్పుడంటే హీరోయిన్‌ అయ్యింది కాని.. అసలు ముందులో ఆమె ఎప్పుడూ పాప్‌ సింగర్‌ అవ్వాలనే అనుకునేదట. అందుకే అమెరికాలో చదువుకుంటూ పాప్‌ మ్యూజిక్‌లో కూడా శిక్షణ పొందింది. అయితే పాప్‌ తో ఓ రెండు మూడు పాటలు పాడేసి.. ఆ తరువాత ఎందుకనో యాక్టింగ్‌ దారిలో ప్రయాణించడం స్టార్ట్ చేసింది.

అందుకే అప్పుడప్పుడూ మ్యూజిక్‌ డైరక్టర్లు ఎవరు అడిగినా కూడా పాటలు పాడటానికి రెడీగా ఉంటుంది శృతి. ఇకపోతే వచ్చే మార్చి8 విశిష్టత ఏంటో తెలుసుగా? ఆ రోజు ఉమెన్స్‌ డే. అందుకే అమ్మడు మన దేశంలోని మహిళలు అందరికీ నీరాజనం పలికేలా ఒక సాంగ్‌ ను రెడీ చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులైన ఎహసాన్‌ అండ్‌ లాయ్‌ తో కలసి.. అమ్మడు ఈ పాటను కంపోజ్‌ చేసి.. అలాగే దానికి లిరిక్స్‌ రాసి.. ఆ పాటను తానే స్వయంగా పాడి రిలీజ్‌ చేస్తోంది. 'మై డే ఇన్‌ ది సన్‌' అంటూ సాగే ఈ ట్రాక్‌ ఖచ్చితంగా అమ్మాయిలందరికీ నచ్చుతుందని ఆమె కోరిక.

సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే నాగ చైతన్య సరసన ''ప్రేమమ్‌'' సినిమాతో మన ముందుకు రానుంది శృతి హాసన్‌.