Begin typing your search above and press return to search.
శ్రుతి లవ్ లో పాపం పసోడు! మెల్లి మెల్లిగా కమల్ నే కాకా పట్టాడు!
By: Tupaki Desk | 1 March 2021 8:00 AM ISTఅవును.. శ్రుతిహాసన్ ప్రేమలో పాపం పసోడు! గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్. నాలుగేళ్ల ప్రేమాయణం అనంతరం విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుండి శ్రుతి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లానని ఇటీవల వెల్లడించింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కుదుటపడుతోంది. ఓవైపు కథానాయికగా కెరీర్ పరంగానూ బౌన్స్ బ్యాక్ అవుతోంది.
ఇలాంటి సమయంలోనే తనకు ఆర్టిస్ట్ శంతనుతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి అభిరుచులు ఒకటే అని శ్రుతి అసలు మ్యాటర్ లోకి వచ్చేయడమే గాక.. అతడితో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేయడం యువతరంలో చర్చనీయాంశమైంది. ఏదీ దాపరికం లేదు. ప్రతిదీ ఓపెన్ గానే ఉంది వీళ్ల వ్యవహారం. స్నేహితుడు అని చెబుతున్నా.. ప్రేమికుడేనని లోకం నమ్ముతోంది.
ఇదిలా ఉండగానే.. నిన్నటిరోజున శంతను సడెన్ గా చెన్నైలో ప్రత్యక్షమయ్యాడు. తన ప్రేయసిని కౌగిలించుకుని ఫోటోలు దిగాడు. ఇక ఆ ఇద్దరూ ఒకే బ్రాండ్ మాస్క్ ని కూడా ధరించారు. చెన్నైలో చిల్లింగ్ సీన్స్ అంటూ శంతనుతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే గాక తన అభిమానుల్ని టీజ్ చేసారు శృతిహాసన్.
కౌగిలింతలేనా? ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా తమకంలో ఉన్న ఫోటోలను చూసి నెటిజనం వెర్రెత్తిపోయారు. కేవలం శ్రుతితో లవ్ ని వ్యక్తం చేయడమే కాదు.. శంతను మరో తెలివైన పని కూడా చేశాడు. అతడు కాబోయే మామ కమల్ హాసన్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తమిళ రాజకీయాల్లో అలసత్వాన్ని ఎండగట్టి ప్రక్షాళన కోసం బయలు దేరిన కమల్ ఓ చేతిలో గొడ్డలి.. మరో చేతిలో టార్చ్ లైట్ ను పట్టుకొని నడిచి వస్తున్న థీమ్ బేస్డ్ ఫోటోను స్వయంగా ఆర్ట్ వేసి మరీ కానుకిచ్చారు. ఆ ఒక్క గిఫ్ట్ తోనే కమల్ స్పెల్ బౌండ్ అయిపోవడమే గాక.. ఆ ఫోటోని ఇన్ స్టా లోనూ షేర్ చేశారు. ఈ వ్యవహారంతో శంతనుతో కూతురి ప్రేమను అంగీకరించినట్టేనని అంతా భావిస్తున్నారు. అయితే శ్రుతి కానీ.. శంతను కానీ తమ ప్రేమను పబ్లిక్ గా అంగీకరించనే లేదు ఇంకా.