Begin typing your search above and press return to search.
మళ్లీ ప్రేమలో పడ్డానని నోరు జారిన శ్రుతి..!
By: Tupaki Desk | 26 Jan 2021 11:30 AM GMTసామాజిక మాధ్యమాల్లో నోరు జారితే ఇంకేమైనా ఉందా? జనం వెంటనే మోసేస్తారు. అలాంటి సన్నివేశమే ఎదురైంది అందాల శ్రుతిహాసన్ కి. ఈ భామ ఓ ఆన్ లైన్ ప్రశ్నోత్తరాల సెషన్ లో అనుకోకుండా నోరు జారి బుక్కయ్యింది. అది కూడా రెండోసారి ప్రేమ గురించి ఓపెనైపోయింది. అసలేమైంది? అన్నది ఆరా తీస్తే..
తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్లతో లైవ్ చాట్ లో రకరకాల ప్రశ్నలకు సమాధానమిచ్చిన శ్రుతికి ఊహించని ప్రశ్న ఎదురైంది. ``మీరు మళ్లీ ప్రేమలో ఉన్నారా?`` అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి ``అవుననుకుంటా..!` అంటూ నోరు జారింది. ఇంకేం ఉంది శ్రుతి మళ్లీ ప్రేమలో పడింది అంటూ ఒకటే ప్రచారం వేడెక్కింది. ఇదే చాట్ లో ఒక వ్యక్తి ``మీ మాజీ బాయ్‌ఫ్రెండ్ ను ద్వేషిస్తున్నారా?`` అని కూడా ప్రశ్నించాడు.
``నువ్వు చాలా చెడ్డ వాడిలా ఉన్నావ్. నేను నా జీవితంలో ఎవరినీ ద్వేషించను. కానీ ఆ విషయంలో కొంచెం బాధ ఉంది. అయినా అతడితో బ్రేకప్ అయిపోయింది కదా`` అంటూ కాస్త నైరాశ్యం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లాడేదే లేదని సెలవిచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే మైఖేల్ కోర్సలే అనే విదేశీయుడితో నిండా ప్రేమలో మునిగిన శ్రుతిహాసన్ అతడిని తన తండ్రి కమల్ హాసన్ కి పరిచయం చేసింది. ఇక ఈ జంటకు పెళ్లయిపోతుందనే భావించారంతా. కానీ అంతలోనే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత డీప్ గా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శ్రుతి.. తిరిగి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారి అన్నీ మర్చిపోతోంది. ఇటీవలే శ్రుతి నటించిన క్రాక్ రిలీజైంది. మంచి ఫలితం దక్కింది. తదుపరి సేతుపతి సరసన నటించిన లాభం రిలీజ్ కావాల్సి ఉంది. పవన్ సరసన నటించిన వకీల్ సాబ్ వేసవిలో రిలీజ్ కానుంది. కంబ్యాక్ ని శ్రుతి ఎంతో పకడ్భందీగానే ప్లాన్ చేయడం ఆసక్తికరం.