Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ వేడి మీదున్నాడంటూ అగ్గి రాజేసింది!

By:  Tupaki Desk   |   5 March 2021 9:32 AM GMT
ప్ర‌భాస్ వేడి మీదున్నాడంటూ అగ్గి రాజేసింది!
X
న‌వ‌నాయిక‌ల క‌ల‌ల‌రాకుమారుడిగా వెలిగిపోతున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. అత‌డిని పెళ్లాడేందుకు ప‌లువురు క‌థానాయిక‌లే పోటీప‌డ్డార‌ని తామ‌ర‌తంప‌ర‌గా గాసిప్పులు ప్ర‌చారం అయ్యాయి. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కోసం క‌ల‌లు క‌నే భామ‌లెంద‌రో.

అదంతా స‌రే కానీ.. ప్ర‌భాస్ కి అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చింది అందాల శ్రుతిహాస‌న్. అత‌డు వేడి మీదున్నాడంటూ వ్యాఖ్యానించి అగ్గి రాజేసింది. క్రాక్ సినిమాతో ఘ‌న‌మైన రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి త‌దుప‌రి వ‌కీల్ సాబ్ చిత్రంతో ప‌వ‌న్ అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌స్తోంది. అటుపై ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ అనే భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ చిత్రంలో న‌టించ‌నుంది.

ప్ర‌భాస్ ఓవైపు ఆదిపురుష్ 3డి.. మ‌రోవైపు స‌లార్ చిత్రీక‌ర‌ణ‌ల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ్రుతిహాస‌న్ ఓ చిట్ చాట్ లో మాట్లాడుతూ `ప్ర‌భాస్ చాలా వేడిమీదున్నాడు!` అంటూ వ్యాఖ్యానించారు. స‌లార్ గురించి మరో ముఖ్యమైన విషయం శ్రుతి వెల్ల‌డించింది. ఇందులో త‌న పాత్ర సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్ పాత్ర‌లా యాక్ష‌న్ చేయ‌ద‌ని తెలిపింది‌. ఇంత‌కుముంచి ఇంకేం చెప్పినా చాలా ముంద‌స్తు అవుతుంద‌ని క‌ట్ చేసింది. అయితే తాను ఇచ్చిన హింట్ ప్ర‌కారం.. కేవ‌లం ప్ర‌భాస్ ని ల‌వ్ చేసే పాత్ర అది అని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ వ‌ర‌కే యాక్షన్. శ్రుతితో ఇందులో డ్యూయెట్ల‌కు ఆస్కారం ఉందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ప్ర‌భాస్ మాఫియా డాన్ గా క‌నిపించ‌నున్నారు. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హోంబ‌లే సంస్థ నిర్మిస్తోంది.