Begin typing your search above and press return to search.
శ్రుతిహాసన్ గ్లామరు .. బరువు పెంచాల్సిందే!
By: Tupaki Desk | 29 Jan 2021 11:50 AM GMTశ్రుతిహాసన్ అప్పుడే కురిసిన మంచుబొట్టులా ఉంటుంది .. మరువాల మధ్యలో విరిసిన మల్లెమొగ్గలా ఉంటుంది. నాజూకుదనానికి అర్థం ఏమిటి? .. నిర్వచనం ఏమిటీ? అనే ప్రశ్నలకు అసలు సిసలైన సమాధానం ఆమె పేరే. అలాంటి శ్రుతి హాసన్ తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. హిందీలో తన జోరు చూపించాలనే పట్టుదలతో ఉన్న సమయంలోనే ప్రేమలో పడటం .. కెరియర్ ను పక్కన పెట్టేయడం జరిగిపోయాయి. సరదాలు .. షికార్లు అన్నీ పూర్తయిన తరువాత అప్పుడు ఆమెకి తాను ఎక్కడి నుంచి వచ్చింది అర్థమైంది.
'శుభలగ్నం' సినిమాలో ఆమనిలా తిరిగి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చేసరికి, ఇటు టాలీవుడ్‌లోను .. అటు కోలీవుడ్లోను హీరోయిన్లుగా కొత్తమ్మాయిల కోలాహలం కనిపించింది. అయినా సరే ఒక రాయి వేసి చూసింది. అది నేరుగా వెళ్లి 'క్రాక్' సినిమాకి తగలడం .. అందులో ఆమెకి అవకాశం దక్కడం జరిగిపోయాయి.ఇంత గ్యాప్ తీసుకుని శ్రుతిహాసన్ తిరిగి వచ్చినా, వెంటనే అవకాశం దక్కిందంటే నిజంగా అది విశేషమే. అంతేకాదు నేరుగా ఆమె ప్రభాస్ జోడీగా 'సలార్' సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది .. అందరి హీరోయిన్లు అవాక్కయ్యేలా చేసింది.
'క్రాక్' సినిమా హిట్ అయినప్పటికీ, కథానాయికగా శ్రుతి హాసన్ కి పడిన మార్కులు చాలా తక్కువ. ఆమెలో గ్లామర్ పాళ్లు బాగా తగ్గాయనే అంతా చెప్పుకున్నారు. మునుపటి అందం .. ఆకర్షణ లోపించాయనే అనుకున్నారు. మేకప్ తో కవర్ చేయడానికి ఎంతగా ప్రయత్నించినా, లోపలికి వెళ్లిన ఆమె బుగ్గలను మాత్రం పూడ్చలేకపోయారు. కొన్ని చోట్ల ఆమె ఫేస్ మరీ కళ తప్పినట్టుగా కనిపించింది. ఇప్పుడేమే 'సలార్'లో ఛాన్స్ అంటున్నారు. శ్రుతి పోర్షన్ మొదలయ్యేసరికి ఆమె కాస్త బరువు పెరగాలి .. గ్లామర్ ను పెంచాలి. ఇలాగే పీలగా ఉంటే మాత్రం ప్రభాస్ జోడీగా తేలిపోవడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.