Begin typing your search above and press return to search.

వీడియో: శ్రుతీ ఆ పిడిగుద్దులు శంత‌ను త‌ట్టుకోగ‌ల‌డా?

By:  Tupaki Desk   |   2 April 2021 12:52 PM GMT
వీడియో: శ్రుతీ ఆ పిడిగుద్దులు శంత‌ను త‌ట్టుకోగ‌ల‌డా?
X
గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ రీఎన‌ర్జీతో కొత్త ఉత్సాహంతో క‌నిపించ‌డం వెన‌క అస‌లు కార‌ణం క‌నిపెట్టారా? దానికి కార‌ణం ఎవ‌రో ఇప్పుడే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక చాలా కాలం డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయిన శ్రుతి అద‌న‌పు బ‌రువు పెరిగి పూర్తిగా షేప‌వుట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆ డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంత‌కాలం సంగీతం.. పాప్ ఆల్బ‌మ్స్ అంటూ కాల‌క్షేపం చేసింది. జిమ్ యోగా అంటూ బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించింది.

అలాగే స్వ‌త‌హాగా త‌న‌కు ఆర్ట్ అంటే ఇష్టం కాబ‌ట్టి డూడుల్ ఆర్టిస్టు శంత‌ను హ‌జారికాతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆయ‌న ప‌రిచ‌యం ఒక మేలి మ‌లుపు. అత‌డో ఎన‌ర్జీ బూస్ట‌ర్ అయ్యాడు. శ్రుతి మునుప‌టితో పోలిస్తే ఎంతో ఆనందంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల అత‌డి సాన్నిహిత్యంలో ప్రతి విష‌యాన్ని అభిమానుల‌కు షేర్ చేస్తోంది. అదంతా స‌రే కానీ.. ఫిట్నెస్ ఫ్రీక్ గా అభిమానుల గుండెల్లో నిలిచిన శ్రుతి .. తాజాగా షేర్ చేసిన వీడియో హీట్ పెంచేస్తోంది.

ఇంత‌కీ ఆ వీడియోలో ఏం ఉంది? అంటే .. శ్ర‌తి చాలా సీరియ‌స్ గా మార్ష‌ల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. పంచ్ లు విస‌ర‌డం పిడిగుద్దులు కురిపించ‌డం వంటి సీరియ‌స్ మార్ష‌ల్ ఆర్ట్స్ లో రాటు దేలుతోంది. దానికి కోచ్ స‌హ‌క‌రిస్తున్నాడు. అయితే మ‌రీ ఇంత‌గా పిడిగుద్దులు కురిపిస్తే శంత‌ను ప‌రిస్థితి ఏం కావాలి? అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఒక వీరాభిమాని అయితే `ఒకేసారి ఇద్ద‌రిపై పిడిగుద్దులు కురిపించ‌డ‌మెలా?` అంటే ఇలాగ అంటూ శ్రుతి ప్రాక్టీస్ వీడియోని చూపించాడు. మొత్తానికి ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే క్రాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధంచాక‌.. ఈ వారంలో వ‌కీల్ సాబ్ రిలీజ్ కి వ‌స్తోంది. ర‌వితేజ‌.. ప‌వ‌న్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న శ్రుతి కంబ్యాక్ అదర‌గొడుతోంది అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.