Begin typing your search above and press return to search.

వీడియో : 'సలార్‌' డైరెక్టర్‌ తో హీరోయిన్‌ అల్లరి

By:  Tupaki Desk   |   15 Sep 2021 5:31 AM GMT
వీడియో : సలార్‌ డైరెక్టర్‌ తో హీరోయిన్‌ అల్లరి
X
కేజీఎఫ్‌ సినిమాతో ప్రశాంత్ నీల్‌ పాన్ ఇండియా స్టార్‌ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు. కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఫిల్మ్‌ మేకర్స్ ను సినిమాలను కేజీఎఫ్‌ కు ముందు వరకు జనాలు పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేజీఎఫ్ సినిమా కన్నడ సినిమా గురించి నేషన్ మాట్లాడుకునేలా చేసింది. అక్కడ కూడా భారీ సినిమాలు తెరకెక్కుతాయి.. వారికి కూడా సత్తా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ వల్లే అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 ను విడుదల చేసేందుకు రెడీ చేసిన ప్రశాంత్‌ నీల్‌ మరో వైపు ప్రభాస్ తో సలార్ సినిమా చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాలున్న సలార్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్‌ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే. శృతి హాసన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన లైఫ్‌ స్టైల్‌ అప్‌డేట్స్ ను సినిమా అప్‌డేట్స్ ను ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నాకు ఇష్టమైన దర్శకుడిని విసిగిస్తున్నాను.. నాకు ఇష్టమైన పని చేసి నా ఫేవరేట్‌ డైరెక్టర్ కు కోపం తెప్పిస్తున్నాను అంటూ ఈ వీడియోను షేర్‌ చేసింది. సెట్స్ లో ఫోన్ వాడటం ప్రశాంత్ నీల్‌ కు ఇష్టం ఉండదని.. శృతి హాసన్‌ మాత్రం గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుని ఉంటుంది. అందుకే నాకు ఇష్టమైన పని అంటే ఫోన్ పట్టుకుని వీడియో తీయడం చేస్తూ ప్రశాంత్‌ నీల్‌ ను విసిగిస్తున్నట్లుగా శృతి హాసన్ పేర్కొంది. శృతి హాసన్ వీడియో తీస్తున్న సమయంలో కాస్త ఇరిటేషన్ రియాక్షన్ ను ప్రశాంత్ నీల్ ఇవ్వడం జరిగింది. శృతి హాసన్‌ ఈ వీడియో ను ఫన్నీగా షేర్‌ చేసింది. ప్రస్తుతం సలార్‌ సినిమా చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరుపుకుంటోంది. శృతి హాసన్ ను ఈ సినిమాలో చాలా యూనిక్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. యాక్షన్‌ సినిమాల్లో హీరోయిన్స్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే అభిప్రాయం ఉంది. కాని కేజీఎఫ్‌ లో మాదిరిగా కాకుండా సలార్‌ లో శృతి హాసన్‌ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారట.

మొన్నటి వరకు ఆదిపురుష్ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ప్రభాస్‌ ఏమాత్రం గ్యాప్ లేకుండా సలార్‌ తో జాయిన్ అయ్యాడు. కీలకమైన లవ్ కమ్‌ యాక్షన్‌ సన్నివేశాలను ఈ షెడ్యూల్‌ లో చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ సలార్‌ ను ఈ ఏడాది చివరి వరకు ముగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రభాస్ కూడా సలార్‌ మరియు ఆదిపురుష్‌ లను ముగిస్తే తదుపరి సినిమాలను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టాలని ప్లాన్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ శృతి హాసన్ విషయానికి వస్తే తెలుగు లో సలార్ తో పాటు హిందీలో రెండు సినిమాలను కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక తమిళంలో ఈమె ఇటీవలే ఒక పెద్ద సినిమాకు సైన్ చేసిందట. మొత్తానికి స్టార్స్ తో రూపొందుతున్న సలార్ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది కనుక ఖచ్చితంగా సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయడం పక్కా అంటున్నారు.