Begin typing your search above and press return to search.
వివాదాలు కలిసొచ్చి వసూళ్ల ధమాకా
By: Tupaki Desk | 23 Feb 2020 4:30 PM GMTకొన్నిటికి వివాదాలు సమస్యాత్మకంగా మారితే మరికొన్ని చిత్రాలకు అదే వరంగా మారుతోంది. తొలినుంచి వివాదాస్పద కాన్సెప్టుతో ప్రచారం దక్కించుకున్న బాలీవుడ్ మూవీ `శుభ్ మంగల్ జాదా సావధాన్` ఈ శుక్రవారం రిలీజై కలెక్షన్ల ధమాకా మోగిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. విలేజ్ కుర్రాళ్ల స్వలింగసంపర్కం కథాంశాన్ని ఆద్యంతం రక్తి కట్టించేలా తెరకెక్కించారని సమీక్షలు వచ్చాయి.
గే కాన్సెప్ట్ కావడంతో గల్ఫ్ దేశాల్లో రిలీజ్ ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయినా దాంతో పని లేకుండా స్వదేశంలో చక్కని వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ఓపెనింగ్ డే ఏకంగా 10 కోట్ల నెట్ వసూలు చేసి తొలి వీకెండ్ నాటికే 30 కోట్లు పైగా వసూలు చేస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి.
వరుస హిట్లతో దూకుడుమీదున్న ఆయుష్మాన్ తన ఖాతాలో మరో విజయాన్ని ఖాయం చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రొటీనిటికీ భిన్నంగా వెళుతూ ఈ యంగ్ హీరో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేస్తున్నాడు. ఒకరకంగా మన తెలుగు యంగ్ హీరోలకు అతడు ఓ పాఠ్య పుస్తకం లాంటోడు అనే చెప్పాలి.