Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బికినీ సమాజ ప్రతినిధి

By:  Tupaki Desk   |   2 Oct 2019 6:51 AM GMT
ఫోటో స్టోరీ: బికినీ సమాజ ప్రతినిధి
X
టన్నుల్లో హాట్ నెస్ ఉండి కూడా ఇంకా పాపులారిటీ దక్కని భామలలో శుభ్ర అయ్యప్ప ఒకరు. మోడల్ గా పలు అడ్వర్టైజ్మెంట్లకు పని చేసిన ఈ బ్యూటీ నారా రోహిత్ 'ప్రతినిధి' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'యవ్వనం ఒక ఫ్యాంటసీ' అనే మరో చిత్రంలో కూడా నటించింది. తర్వాత తమిళం.. కన్నడ సినిమాల్లో నటించింది. ఆఫర్ల సంగతేమో కానీ తన ఫోటోలతో నెటిజన్ల హార్టు బీటును పెంచడంలో ఈ భామ దిట్ట.

శుభ్ర తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "వేసవి చివరి రోజుల్లో ఉండే అందాన్ని ఆస్వాదిస్తున్నాను" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉండే మయామిలో ఒక స్విమ్మింగ్ పూల్ లో బికినీ ధరించి నవ్వుతూ కూర్చుంది. మరి 'వేసవి చివరి రోజులు అని అంటుందే' అని అనుమానం రావచ్చు కానీ పాప ప్రస్తుతం ఉండేది ఫ్లోరిడాలో కదా. అక్కడ మే నుంచి సెప్టెంబర్ వరకూ వేసవి కొనసాగుతుందట. దాన్ని ఎక్స్ టెండెడ్ సమ్మర్ అని పిలుచుకుంటారు. కాబట్టి ఈ బికినీ పాపకు బుర్రలేదు అని తిట్టుకోవాల్సిన పనే లేదు.

సరే.. ఫోటో విషయానికి వస్తే బ్లూ కలర్ బికినీలో పూల్ ఒడ్డున కూచుంది.. కాళ్ళను మాత్రం నీటిలో ఉంచింది. ఆ అందాన్ని వర్ణించాలంటే కనీసం 'అమృతం కురిసిన రాత్రి' తిలక్ దిగిరావాలి. సాధారణ వ్యక్తులు అసలు సరిపోరు. నెటిజన్లు ఈ ఫోటో దెబ్బకు పిచ్చెక్కిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "బికినీ ఏంజెల్".. "కాల్విన్ క్లెయిన్ ట్రై చెయ్".. "గ్రేట్ బికినీ షేప్" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.