Begin typing your search above and press return to search.

పెళ్లి గురించి అమితాబ్ డాట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:30 PM GMT
పెళ్లి గురించి అమితాబ్ డాట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు న‌వ్యా న‌వేలి నందా సుప‌రిచిత‌మే. మ‌న‌వ‌రాలు మ్యాక‌ప్ వేసుకోక‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాలోయింగ్ సంపాదించిన బ్యూటీ. 'వాట్ ది హెల్ న‌వ్య' అనే పోడ్ కాస్ట్ చాట్ షో కూడా చేస్తుంది. తాజాగా దానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కోసం న‌వ్య త‌ల్లి..బిగ్ బీ కుమార్తె శ్వేత నందా.. జ‌యాబ‌చ్చ‌న్ ఆ పోడ్ కాస్ట్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

ఇంత‌వ‌ర‌కూ ఏ వేదిక‌పైనా? షేర్ చేసుకోని వ్య‌క్తిగ‌త విష‌యాలు ఇందులో షేర్ చేసుకోవ‌డం విశేషం. ఇందులో శ్వేతా నంద ఆర్ధికంగా స్వాతంత్ర్యంగా లేన‌ట్లు చెప్పుకొచ్చారు. ఆమె మోడ‌ల్ గా...కాల‌మిస్ట్ గా..వ్యాపార వేత్త‌గా విజ‌యం వంతం అయ్యారు. కానీ ఆమె నుంచి ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. 'దుర‌దృష్టంశాత్తు ఆర్ధికంగా స్వాతంత్ర్యంగా లేను.

కొన్ని ప‌నులు చేయ‌లేను. నా పిల్ల‌లు అలా ఉండాల‌ని కోరుకోవ‌డం లేదు. అద్దె చెల్లించ‌డానికి... సొంత ఇల్లు కొనుక్కోవ‌డానికి.. త‌గినంత డ‌బ్బు లేక‌పోతే వివాహం చేసుకోవ‌ద్ద‌ని చెబుతాను. వారు నాలా కాకుండా స్వాతంత్ర్యంగా ఉండాల‌ని కోరుకుంటాను. నా కుమార్తెకు ఆర్ధిక భ‌ద్ర‌త ఉండాలి. తండ్రి ఉప‌యోగించుకోకుండా ఉంటే అది న‌వ్య‌కి విప‌రీత‌మైన విశ్వాసాన్ని ఇస్తుంద‌ని భావిస్తున్నాను.

ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు కొంద‌ర్ని ఆలోజింప చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్య‌ల్లో నిజం లేక‌పోలేదుగా అంటూ విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రపంచం డ‌బ్బుతో న‌డుస్తుంది. అది లేక‌పోతే మ‌నిషి జీరో అన్నంత‌గా మ‌నీ ప్ర‌భావం చూపిస్తుంది.

అందుకు వ్య‌వ‌స్థ‌లో ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయి. అవినీతి పెరిగిపోవ‌డం...మోసం..వంచ‌న వంటి ప‌దాల్ని న‌ర‌న‌రాన జీర్ణించుకుని బ్ర‌తుకుతోన్న‌ విధానం మ‌నిషి జీవ‌న విధానంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి.

నవ్య చేస్తున్న ఈ పోడ్ కాస్ట్ సెప్టెంబర్ 24న ప్రారంభమైంది. కొత్త ఎపిసోడ్ ప్రతి శనివారం విడుదల కానుంది. కాగా శ్వేత కుమారుడు అగస్త్య ప్రస్తుతం జోయా అక్తర్ 'ది ఆర్చీస్' ద్వారా బాలీవుడ్‌కి పరిచయం కానున్నాడు. ఇదే సినిమాతో ప‌లువురు బాలీవుడ్ వార‌సులు తెరంగేట్రం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.