Begin typing your search above and press return to search.

మీడియాపై మెగాస్టార్ కూతురు ఆగ్రహం ఇది!

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:53 AM GMT
మీడియాపై మెగాస్టార్ కూతురు ఆగ్రహం ఇది!
X
ఆమె ఒక టీనేజర్.. ఆ వయసులో అమ్మాయిలు ఎలా ఉంటారో తానూ అలాగే ఉంది.. దీనికి ఇంతటి ఫోకస్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు మెగాస్టార్ అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్ నంద. తాజాగా అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్ నంద తన కుమార్తె నవ్య కోసం ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే అది ఆమెకోసం కాకుండా మీడియాను టార్గెట్ చేస్తూ రాశారు. తన కుమార్తె శరీరాన్ని ఉద్దేశించి "హాట్" - "వైల్డ్" వంటి పదాలు ఉపయోగించడంపై ఆవేదన చెందుతూ రాసిన ఆలేఖలో శ్వేతా బచ్చన్ మీడియాపై పలు ప్రశ్నలు సందించారు.

సోషల్ మీడియాలో స్నేహితులతో నవ్య షేర్ చేసుకున్న ప్రైవేట్ ఫొటోలను వెబ్‌ సైట్లలో పెడుతున్నారు.. ఇలా చేస్తున్నందుకు ఆమె అనుమతి తీసుకుంటున్నారా అంటూ సూటిగా ప్రశ్నించిన శ్వేతా బచ్చన్.. బీచ్‌ కు వెళ్లినప్పుడు ఎవ్వరైనా స్విమ్ సూటే వేసుకుంటారు అలాగే తన కూతురు నవ్య కూడా వేసుకుందని, మిత్రులన్నాక అబ్బాయిలూ ఉంటారు - అమ్మాయిలూ ఉంటారు - వారందరితో సరదాగా పార్టీలకు వెళ్తుంటుంది... అంతమాత్రాన్న అలా రాసేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నవ్య కూడా ఓ సర్వ సాధారణ టీనేజరే తప్ప అంతకు మించి ఆమెలో అసంబద్ధ ప్రవర్తనను తానేమీ గమనించలేదని కాస్త గట్టిగానే సందించారు శ్వేత బచ్చన్. తనగురించి మీడియాలో వస్తున్న వార్తలేవీ ప్రస్తుతానికి నవ్యకు తెలీదని చెబుతున్న శ్వేత... చిన్న పిల్లలపై ఇలా "హాట్" అనీ - "వైల్డ్" అనీ కామెంట్ చేయడం పద్దతి కాదని సూచిస్తున్నారు.

కాగా, "పింక్" మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన మనవరాళ్లు నవ్య నవేలి - ఆరాధ్య బచ్చన్‌ లకు రాసిన లేఖ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో... "కుటుంబం - సమాజం పరిమితులు విధించినా కూడా స్వంత వ్యక్తిత్వంతో ముందడుగేయాలి" అని సూచించారు. ఇదే క్రమంలో శ్వేతా బచ్చన్ కూడా తన కుమార్తెకు ఒక లేఖ రాశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/