Begin typing your search above and press return to search.
నవల రాస్తున్న మెగాస్టార్ కూతురు
By: Tupaki Desk | 13 April 2018 10:08 AM GMTహీరోల కొడుకులు హీరోలవుతారు. మరి కూతుర్లు... నిర్మాతలు గానీ లేదా దర్శకురాలిగా మారి తెర వెనక మాత్రమే చక్రం తిప్పాలని చూస్తారు. కానీ బాలీవుడ్ మెగాస్టార్ కూతురు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించింది. అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్ల కూతురు శ్వేతా బచ్చన్ నందా త్వరలో నవలా రచయితగా మారబోతోంది. ఆమె తొలి నవల పేరు ‘ప్యారడైజ్ టవర్స్’.
ఇప్పటికే వార్తా పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ చాలామంది పాఠకుల అభిమానాన్ని చూరగొంది శ్వేతా. సామాజిక- సాంఘిక- స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తన రచనల ద్వారా స్పందిస్తుంటుంది శ్వేతా నందా. తండ్రికి తగ్గట్టుగానే ఆర్టికల్స్ రాయడంలో మంచి ప్రావీణ్యం ఉందని నిరూపించుకుంది. ఆ టాలెంట్ తోనే శ్వేతా బచ్చన్ నందా ‘ప్యారడైజ్ టవర్స్’ పేరుతో తన తొలి నవల రాసింది. దీన్నిప్రచురించేందుకు ఓ ప్రముఖ పబ్లిషర్స్ ముందుకొచ్చారని సమాచారం. ఈ ఏడాది చివరికల్లా బచ్చన్ వారసురాలి నవల మార్కెట్లోకి రాబోతోంది. తొలి నవల ఇంకా మార్కెట్లోకి విడుదల కాకముందే రెండో నవల రాసేందుకు కూడా పబ్లిషర్స్ తో ఒప్పందం కుదుర్చుకుందట శ్వేతా.
తన రెండో పుస్తకం తండ్రి అమితాబ్ బచ్చన్ గురించి ఉండబోతుందని సమాచారం. బిగ్ బీ వారసురాలిగా నటనను కెరీర్ గా ఎంచుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టలేదని చెప్పిన శ్వేతా బచ్చన్ నందా... కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. ఇప్పుడు నవలా రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. బచ్చన్ కూతురా... మజాకా!