Begin typing your search above and press return to search.
టెన్షన్ టెన్షన్.. ఇటలీలో చిక్కుకున్న టాలీవుడ్ సింగర్
By: Tupaki Desk | 26 March 2020 5:30 AM GMTచైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ఇటలీని చిగురుటాకులా వణికిస్తుంది. చైనా కంటే కూడా అత్యధికంగా ఇటలీలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేసుల సంఖ్య కూడా ఒకటి రెండు రోజుల్లో చైనాను ఇటలీ దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటలీ అంటేనే ప్రపంచ దేశాలో పాపం అంటున్నారు. అక్కడున్న వారి పరిస్థితిని తల్చుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో ఇంకా బాలీవుడ్ లో పలు పాటలు పాడి అభిమానులను దక్కించుకున్న ప్రముఖ సింగర్ శ్వేతా పండిట్ ఇటలీలో ఉండి పోయింది.
ప్రస్తుతం ఇటలీలో ఉన్న పరిస్థితులను ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేసింది. తెల్లవారితే ఆంబులెన్స్ సౌండ్స్ తోనే డే మొదలవుతుంది. కళ్ల ముందు జనాలు మృతి చెందుతుంటే గుండెలు పలుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. అయినా కూడా ప్రపంచంలో అత్యధికంగా కరోనాకు ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతానికి తన పరిస్థితి ఆందోళన కరంగా ఏమీ లేదని.. బయటకు వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తన చుట్టు ఉన్న వారిలో పలువురు కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్ వార్డుకు వెళ్లారంది. కుటుంబ సభ్యులతో కూడా దూరం పాటించడంతో పాటు స్నేహితులతో వీడియో కాల్స్ మాత్రమే మాట్లాడుతూ ఇంట్లో ఉండి టీవీ చూస్తూ టైం పాస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించడం మంచి నిర్ణయంగా ఆమె అభివర్ణించింది. తన ఆరోగ్యం గురించి పలు దేశాల నుండి టెన్షన్ పడుతూ స్నేహితులు.. కుటుంబ సభ్యులు కాల్స్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. తాను పూర్తి సేఫ్ గా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో తెలియజేయడంతో అభిమానులు కాస్త రిలాక్స్ అవుతున్నారు.