Begin typing your search above and press return to search.
డేరింగ్ ప్రొడ్యూసర్ భయపడ్డ వేళ..
By: Tupaki Desk | 15 Aug 2017 9:33 AM GMTతెలుగు సినిమా చరిత్రలో శ్యాం ప్రసాద్ రెడ్డితో ఒక ప్రత్యేక అధ్యాయం. ‘అంకుశం’.. ‘అమ్మోరు’.. ‘అంజి’.. ‘అరుంధతి’.. ఇలా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సాహసోపేతమైందే. నిర్మాతకు ఎలాంటి అభిరుచి ఉండాలో.. ఎంత ప్యాషన్ ఉండాలో ఆయన్ని చూస్తే తెలుస్తుంది. రాజమౌళి లాంటి దర్శక ధీరుడు కూడా ప్యాషన్ విషయంలో శ్యాం ప్రసాద్ రెడ్డిని మించిన వాళ్లు లేరని.. ఆయన తనకు స్ఫూర్తి అని అంటుంటాడు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ‘అరుంధతి’ లాంటి అద్భుతమైన సినిమాను అందించారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఐతే ఆ సినిమా అంత పెద్ద హిట్టయినప్పటికీ మళ్లీ ఆయన సినిమాల జోలికి వెళ్లలేదు. డేరింగ్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినీ నిర్మాణం చాలా ప్రమాదకరమని అంటున్నారు. తన కుటుంబం నుంచి ఒకరు నిర్మాణంలోకి వస్తానంటే తాను వద్దే వద్దని చెప్పినట్లు వెల్లడించారు.
‘ఆనందో బ్రహ్మ’ నిర్మాతల్లో ఒకడైన విజయ్.. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి బంధువట. అతడికి శ్యామ్ బాబాయి అవుతాడట. విజయ్ కి చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి అని.. తనను కలిసినపుడల్లా సినిమాల గురించి చర్చిస్తాడని.. ఒక రోజు తాను ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నట్లు తనకు చెప్పగానే కొంప మునిగిందిరా అనుకున్నానని శ్యామ్ తెలిపాడు. సినీ నిర్మాణం మిగతా వ్యాపారాల్లాగా కాదని.. లెక్కలేసుకుని.. లాజిక్కులతో సినిమాలు నిర్మిస్తే ఫలితం ఉండదని.. తెర మీద ఒక మ్యాజిక్ చేయాల్సి ఉంటుందని.. అది అన్నిసార్లూ సాధ్యపడదని.. ఈ మ్యాజిక్ అందరూ చేయగలిగేట్లయితే టాటాలు అంబానీలు సినిమా వ్యాపారమే చేసేవాళ్లని.. కాబట్టే విజయ్ సినిమా నిర్మాణంలోకి వస్తానంటే తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. వేరే బిజినెస్ చేయమని సలహా ఇచ్చానని శ్యామ్ తెలిపారు.
అయినప్పటికీ అతను వినలేదని.. తనకు సినిమా తప్ప ఇంకే ధ్యాస లేదని.. ఒక ప్రయత్నం చేసి విఫలమైతే వేరే బిజినెస్ లోకి వెళ్తానని చెప్పడంతో అయిష్టంగానే ఓకే చెప్పినట్లు చెప్పారాయన. విజయ్ నిర్మించిన తొలి సినిమా ‘భలే మంచి రోజు’ విడుదలవుతున్నపడు అతడి కంటే తానే ఎక్కువ టెన్షన్ పడ్డాడని.. ఆ సినిమా విజయం సాధించడం.. నిర్మాత అభిరుచి కనిపించడంతో చాలా సంతోషించానని.. ‘ఆనందో బ్రహ్మ’ కూడా కొత్తగా అనిపిస్తోందని.. ఇది కూడా కచ్చితంగా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్యామ్.